చైనా ప్రభుత్వం ఓ వింత నిర్ణయం తీసుకున్నది. విమానయాన సిబ్బంది విధిగా డైపర్లు ధరించాలని ఆదేశించింది. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాల్లో బాత్రూమ్లు వాడొద్దని సూచించింది. కరోనా కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా ప్రకటించింది. లాక్డౌన్ సడలింపులు మొదలయ్యాక.. అన్ని దేశాల్లోనూ విమానయాన సేవలు పునః ప్రారంభమయిన విషయం తెలిసిందే. దీంతో చైనా కూడా విమానయాన సర్వీసులు స్టార్ట్ చేసింది. కాగా కరోనా కట్టడికోసం చైనా విమానయాన సిబ్బంది విధిగా డైపర్లు ధరించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నది.
500లకు పైగా కొవిడ్-19 కేసులున్న దేశాలకు వెళ్లే విమానాల్లో ఈ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.ఈ మేరకు చైనా విమానయాన శాఖ తమ సిబ్బందికి 38 పేజీలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది చేతులకు గ్లౌవ్స్ విధిగా ధరించాలని.. మాస్కులు పెట్టుకోవాలని సూచించింది. ప్రభుత్వం చేసిన ఉత్తర్వులపై విమానయాన సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానంలో డైపర్లు వాడటం ఏంటి అని అంటున్నారు.
మరోవైపు విమానయాన సిబ్బంది డైపర్లు ధరించాలన్న నిర్ణయంపై సోషల్మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. వింత నిర్ణయాలు తీసుకోవడంలో చైనా ఎప్పుడూ ముందుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై జోకులు వేస్తున్నారు. విమానయాన సిబ్బందికి అది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. చైనా మాత్రం ప్రయాణికులు శ్రేయస్సు కోసం, కరోనాకు అడ్డుకట్టవేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.