మృతుల కుటుంబాలను క్షమాపణలు చెప్పిన సీఎం

Update: 2021-03-27 17:30 GMT
ముంబైలో ఇటీవల దారుణం జరిగింది. షాపింగ్ మాల్ లో నెలకొల్పిన కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  ముంబైలోని కరోనావైరస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో మరణించిన 10 మంది మరణించారు. తాజాగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే క్షమాపణ చెప్పారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

ముంబైలోని భండప్ పరిసరాల్లోని షాపింగ్ మాల్  నాలుగో అంతస్తులో ఉన్న డ్రీమ్స్ మాల్ సన్‌రైజ్ హాస్పిటల్ లో  కరోనావైరస్ చికిత్స పొందుతున్న 10 మంది మరణించారు. మరో 70 మంది రోగులను  మహారాష్ట్ర అధికారులు కాపాడి ఇతర ఆస్పత్రులకు తరలించారు.

ఈ ఘటన తరువాత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆసుపత్రిని సందర్శించి మాట్లాడారు.  "అగ్నిమాపక సిబ్బంది ప్రజలను రక్షించడంలో గొప్ప పని చేసారు. అయితే, వెంటిలేటర్లలో ఉన్న కొంతమందిని రక్షించలేకపోయాము. నేను వారి కుటుంబాలను క్షమాపణ కోరుతున్నాను. "

నగరాన్ని చుట్టుముట్టిన కోవిడ్ కేసులను అరికట్టేందుకు   ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు ఠాక్రే చెప్పారు. గత సంవత్సరం మొదటి వేవ్ సమయంలో, ముంబై దేశంలోనే  ఎక్కువగా ప్రభావితమైన మెట్రో నగరంగా ఉందన్నారు.  ప్రాధమిక నివేదికలు మాల్‌లోని ఒక దుకాణంలో  ఆసుపత్రిని పెట్టారని  చెప్పారు. ఆసుపత్రి అనుమతి మార్చి 31 తో ముగుస్తుందని, బాధ్యులను శిక్షిస్తామని సిఎం చెప్పారు.

ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ మాట్లాడారు. "నేను ఒక మాల్‌లో ఆసుపత్రిని చూడటం ఇదే మొదటిసారి. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఏడుగురు రోగులు వెంటిలేటర్లలో ఉన్నారు. 70 మందిని మరో ఆసుపత్రికి తరలించారు. కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు ఉంటుంది. " అని తెలిపారు.

రెండు రోజుల పర్యటనలో బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ప్రమాదంపై స్పందించారు.  "ప్రాణనష్టం వల్ల బాధపడుతున్నానని", గాయపడిన వారి కోసం ప్రార్థిస్తానని చెప్పారు.  "ముంబైలోని ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను "అని ప్రధాని ట్వీట్ చేశారు.
Tags:    

Similar News