ఏళ్లకు ఏళ్లుగా ఉన్న ఊళ్ల పేర్లను మార్చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.కొన్నింటి పేర్లను భావోద్వేగంతో మార్చేస్తుంటే.. మరికొన్ని మాత్రం రాజకీయ కోణంలో మార్పులు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. హోషంగాబాద్ పేరును మార్చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్ర హోం శాఖ అనుమతి రాక ముందే.. ఆయన తాజాగా ఆ ఊరు పేరును నర్మదాపురం గా మార్చనున్న నిర్ణయాన్ని వెల్లడించారు.
సాధారణంగా ఏదైనా ఊరి పేరును.. జిల్లా పేరును మార్చాలంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్ర హోంశాఖ అంగీకారం చాలా అవసరం. ఈ ఊరు పేరును మార్చాలని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గతంలోని కాంగ్రెస్ పాలకులు ఈ డిమాండ్ ను పక్కన పడేశారు. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం మాత్రం అందుకు భిన్నంగా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు.
నర్మదాపురంగా మార్చాలని తాను 2008 నుంచి ప్రయత్నిస్తున్నానని.. కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ నాయకత్వం అందుకు ఓకే చెప్పలేదని.. తన ప్రతిపాదనల్ని పక్కన పట్టేశారన్న శివరాజ్ సింగ్.. ఈసారి మాత్రం కేంద్రం తన నిర్ణయానికి ఓకే చెబుతుందన్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. రాష్ట్ర అభివృద్ధిని.. శాంతిభద్రతల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. ఊళ్ల పేర్లను మార్చటంలో మునిగిపోయిందని మండిపడ్డారు. హోషంగాబాద్ తో పాటు.. మరికొన్ని ప్రాంతాల పేర్లను మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి.. దీనిపై సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.