పూర్తి లాక్ డౌన్ విధించాలనుకుంటున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం !

Update: 2021-05-07 11:40 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొనసాగుతుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశంలో కూడా రానటువంటి పాజిటివ్ కేసులు మన దేశంలో నమోదు అవుతున్నాయి. అలాగే మరణాలు కూడా భారీగానే నమోదు అవుతున్నాయి. ఇక ద‌క్షిణ‌భార‌త‌దేశంలోని క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప‌రిస్థ‌తి మరింత భయంకరంగా ఉంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజుకు 50వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. కరోనా కట్టడి కోసం   ఈనెల 12 వరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినా కూడా కరోనా కొత్త కేసులు నమోదు కావడం తగ్గలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుధాకర్ కీలక ప్రకటన చేశారు. కర్ఫ్యూ విధించినా కరోనా కంట్రోల్ కాలేదని.. రోజూ వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు సంపూర్ణంగా పాటించడం లేదని చెప్పారు.

ఒక్క బెంగ‌ళూరు న‌గ‌రంలోనే ఏకంగా 25 వేల‌కు పైగా కేసులు, 200 ల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.  రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌ డౌన్ విధించాల‌ని, లేదంటే క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల‌కు పెనుముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంటుందని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్  తెలియ‌జేసింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ అమలు చేస్తున్నా కూడా  ఉదయం నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు అనుమతిస్తే... ఎక్కడ చూసినా గుంపులుగుంపులుగా జనాలు పోగవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించడం మినహా మరోదారి లేదని చెప్పారు. ఈ నెల 12 తర్వాత సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించామని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 15 తర్వాత వ్యాక్సిన్ వేస్తామని మంత్రి చెప్పారు. కరోనా నియంత్రణ బాధ్యతలను ఐదుగురు సీనియర్ మంత్రులకు అప్పగించడంపై తనకు అసంతృప్తి లేదని... ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అన్నిటినీ ఒకరే పర్యవేక్షించడం కష్టమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు.
Tags:    

Similar News