ఆకాశానికి చిల్లు పడిన చందంగా కురిసిన భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రాణనష్టంతోపాటు వందలాది మంది ఇళ్లు దెబ్బ తిన్న దుస్థితి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో కురిసిన వర్షాలకు కేరళీయులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇలాంటివేళ ఒక యువ జంట పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. కల్యాణ మండపానికి వారు చేరుకున్న వైనం వైరల్ గా మారింది. భారీ వంట పాత్రలో పెళ్లికుమారుడు.. పెళ్లి కుమార్తె కల్యాణ మండపానికి చేరుకోవటం.. అనంతరం వారు అక్కడికి వెళ్లిన వైనానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలతో అవస్థలు పడుతున్నా.. తాము అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో వారు చేసిన ప్రయత్నాలు అందరిని ఆకర్షిస్తున్నాయి.
అలప్పుజలోని తలవాడికి చెందిన యువ జంట ఆకాష్ .. ఐశ్వర్యలు ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్నారు. అనుకున్న ముహుర్తానికి పెళ్లి చేసుకోవటానికి పెద్ద అడ్డంకిగా భార వర్షాలు మారాయి. వీరు పెళ్లి చేసుకోవాలుకున్న పెళ్లి మండపం వద్ద పెద్దఎత్తున వరద నీరు రావటంతో.. అక్కడకు వెళ్లలేని పరిస్థితి. దీంతో.. వారు వినూత్న ఆలోచన చేశారు. తాము అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో.. భారీ ఆల్యూమినియం పాత్రలో వధూవరులు ఇద్దరు కూర్చుంటే.. వారికి సాయంగా మరో ఇద్దరు.. వరద నీటిలో వారిని జాగ్రత్తగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు.
అక్కడ పరిమిత సంఖ్యలో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య వివాహాన్ని పూర్తి చేశారు. పెళ్లి తర్వాత మండపం నుంచి కూడా అదే భారీ అల్యూమినియం పాత్రలో కూర్చుంటే.. వారిని క్షేమంగా తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. భారీ వర్షాలు.. వరదలు వారి విహానాన్ని అడ్డుకోలేకపోయాయన్న మాట వినిపిస్తోంది. మరికొందరు అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. వరద నీరు పెద్ద ఎత్తున చేరుకున్న వద్దకు వంట పాత్రతో వెళ్లాలన్న ఐడియా మాత్రం అందరిని తెగ ఆకర్షిస్తోంది.
Full View