మామ ఆస్తిపై తనకు హక్కు కల్పించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మామ ఆస్తిపై అల్లుడికి ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండబోవని తీర్పు ఇచ్చింది. తండ్రి ఆస్తిపై కుమారుడితో పాటు కూతురికి హక్కులు ఉంటాయా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కోర్టులో సైతం పలు కేసుల విచారణలో భాగంగా కుమార్తెకు హక్కులు ఉంటాయని ధర్మాసనాలు పేర్కొన్నాయి. తాజాగా మరో ఆసక్తికర ఆస్తి కేసు విచారణ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుమార్తెలు ఎన్నటికీ కుమార్తెలనీ, కానీ కుమారులు మాత్రం పెళ్లి తరువాత గతంలో తరహాలో ఉండరని బాంబే కోర్టు ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది.
తాజాగా ఓ వ్యక్తి తన మామ ఆస్తిపై తనకు హక్కులు కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అతడికి ఎలాంటి హక్కులు ఉండవంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. మామ ఆస్తిపై తనకు హక్కులు కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. మామ ఆస్తిపై అల్లుడికి ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవని స్పష్టం చేసింది. ఒకవేళ మామ నిర్మించిన ఇల్లు, భవనాలకు డబ్బులు ఖర్చు చేసినా సరే వాటిపై అల్లుడికి ఎలాంటి హక్కులు ఉండవని ధర్మాసనం పేర్కొంది. పయ్యన్నూర్ సబ్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కన్నూర్ తాలిపరంబాకు చెందిన డేవిస్ రాఫెల్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.
విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ అనిల్ కుమార్, అల్లుడి చట్టపరంగా ఎలాంటి ఆస్తి హక్కు వర్తించదని తీర్పు వెల్లడించారు. దిగువ కోర్టు ఆదేశాలు సరైనవని వెల్లడించింది. డేవిస్ రాఫెల్ తన ఆస్తి పై కన్నేశాడని అతడి నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని హెండ్రీ థామస్ అనే వ్యక్తి ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు. అల్లుడు డేవిస్ రాఫెల్ నుంచి తన ఆస్తిని రక్షిస్తూ, శాశ్వత పరిష్కారం సూచించాలని కోరాడు. త్రిచంబరంలోని సెయింట్ పాల్స్ చర్చి, జేమ్స్ నస్రత్ ద్వారా బహుమతిగా ఓ స్థలం తనకు లభించినట్లు హెండ్రీ పేర్కొన్నాడు. ఆ స్థలంలో తన సొంత ఖర్చులు, కుటుంబ డబ్బులతో ఇంటిని నిర్మించుకున్నాడు. నిర్మాణం పూర్తయ్యాక అందులోనే నివాసం ఉంటున్నట్లు వివరించాడు. తన ఏకైక కుమార్తెను డేవిస్ కు ఇచ్చి వివాహం జరిపించాడు.
హెండ్రీ కుటుంబం కోసం చర్చి అధికారులు స్థలం కేటాయించారని, ఆయన కుమార్తెను వివాహం చేసుకుని తాను కూడా కుటుంబ సభ్యుడిగా మారినట్లు అల్లుడు డేవిస్ రాఫెల్ వాదిస్తున్నాడు. ఆ ఇంట్లో నివసించే హక్కు తనకు సైతం ఉందని, చట్ట పరంగా ఆస్తిలో హక్కు కల్పించాలని ట్రయల్ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఇరువర్గాల వాదనలు విన్న ట్రయల్ కోర్టు, అల్లుడికి మామ ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఆయన కుమార్తె ను వివాహం చేసుకున్నంత మాత్రాన తనకు ఆస్తిలో వాటా ఉందని వాదిస్తున్న డేవిస్ రాఫెల్ తీరును కోర్టు తప్పుపట్టింది. అల్లుడి చర్యలు సిగ్గుచేటు అని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాల వాదనలు విన్న కేరళ హైకోర్టు.. అల్లుడిని కుటుంబసభ్యుడిగా గుర్తించడం కష్టమని వ్యాఖ్యానించారు. హెండ్రీ కూతురును పెళ్లి చేసుకున్న తరువాత తాను ఆయన కుటుంబంలో ఒకరిగా డేవిస్ రాపల్ కోరడం సిగ్గుచేటు అని కోర్టు అభిప్రాయపడింది.