పచ్చగా అధికారంతో కళకళలాడుతున్న కాంగ్రెస్ పార్టీని ఇపుడు శాపం వెంటాడుతోంది. ఎన్ని కమిటిలు వేసినా, ఎందరు అధ్యక్షులను మార్చినా ఏపిలో కాంగ్రెస్ పార్టీ పరిస్దితిలో మాత్రం మార్పు రావటంలేదు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ విజయవాడలో నిర్వహిచింన సమీక్షలో ఇదే విషయం స్పష్టంగా బయటపడింది.
ఇంతకీ కాంగ్రెస్ ను వెంటాడుతన్న శాపం ఏమిటంటే రాష్ట్ర విభజన. అవును 2014లో రాష్ట్రాన్ని విభజించే సమయానికి అప్పటికి పదేళ్ళ అధికారంతో కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణా ప్రాంతంలో ఉద్యమం జరుగుతోంది. ఇదే సమయంలో విభజన వద్దని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఉద్యమం జరిగింది.
అయితే మెజారిటి నేతలను కాదని, మెజారిటి జనాల సెంటిమెంటును లెక్క చేయకుండా అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. తీసుకున్న నిర్ణయం కూడా అడ్డుగోలుగా ప్రస్తుత ఏపికి అన్నీ విధాలుగా నష్టం చేసే విధంగా తీసుకుంది. ఆస్తులను, ఆదాయాన్ని రాజధాని హైదరాబాద్ ను తెలంగాణాకు ఇచ్చేసింది. అప్పులను, లోటు బడ్జెట్ ను ప్రస్తుత ఏపికి ఇచ్చేస్తు విభజన చేసేసింది.
దాంతోనే జనాలు కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేశారు. పార్టీ ఉత్ధానంపై తీవ్రంగా మండిపడ్డారు. దాని ఫలితమే కాంగ్రెస్ పార్టీ ఇఫుడు శాపగ్రస్త అయిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ, ఎంపి సీటు కూడా గెలుచుకోలేదు. పార్టీ నేతల అంచనా ప్రకారం మరో రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఒక్కసీటు కూడా వచ్చే అవకాశం లేదు. పార్టీ బాగున్నపుడు అన్నీ విధాల అధికారాలను అనుభవించిన సీనియర్ నేతలు ఇపుడు అడ్రస్ కూడా కనబడటంలేదు. ఇదే విషయాన్ని ఊమెన్ తన సమావేశంలో చెప్పటం గమనార్హం.