ఢిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర ... బయటపెట్టిన పోలీసులు , 2,695 పేజీలతో తుది నివేదిక !

Update: 2020-09-22 16:30 GMT
దేశ రాజధానిని కొన్ని రోజుల పాటు అట్టుడికించిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందనే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా గత ఏడాది ఢిల్లీ ఈశాన్యప్రాంతంలో చెలరేగిన అల్లర్లు యాదృశ్చికం కాదని, ఉద్దేశపూరకంగా, అశాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి కొందరు కుట్ర పన్ని అలా చేసినట్టు తెలిపారు. కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీ స్థానాలతో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు సీఏఏను అడ్గుగా పెట్టుకుని అల్లర్లను సృష్టించారని స్పష్టం.

ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్రకు పాల్పడినట్లుగా అనుమానిస్తోన్న 15 మంది పేర్లను ఈ ఛార్జిషీట్ ‌లో పొందుపరిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థి మీరన్ హైదర్, జామియా కోఆర్డినేషన్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ సఫూరా, ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి గుల్ఫిషా, దేవాంగణ కలిత, నటాషా నర్వాల్ తదితరుల పేర్లను ఈ ఛార్జిషీట్‌లో చేర్చారు. వారిపై అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్‌ పై ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ పీఎస్ కుష్వాహా, ఏసీపీ అలోక్ కుమార్ సంతకాలు చేశారు.

ఈ అల్లర్లను సృష్టించడానికి ప్రత్యేకంగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ముస్లిం విద్యార్థుల పేరుతో ఓ గ్రూప్‌ ను రూపొందించుకున్నారని , ఢిల్లీ అల్లర్లను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తమ తుది నివేదిక లో స్పష్టం చేశారు. ఈ అల్లర్ల వల్ల 50 మంది మరణించారని, 500 మందికి పైగా గాయపడ్డారని , ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు చెప్పారు. కొంతమంది అల్లరిమూకలు ఢిల్లీ ప్రొటెస్ట్ సపోర్ట్ గ్రూప్ పేరుతో వాట్సప్ గ్రూప్‌ ను తయారు చేసుకున్నారని, దాని ద్వారా అల్లర్లకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే వారని పోలీసులు తమ నివేదికలో పొందుపరిచారు. దీనిపై 2,695 పేజీల తుది నివేదికను సిద్ధం చేశారు.
Tags:    

Similar News