వివాదాస్పద అధ్యాత్మిక వేత్త డేరా బాబా ప్రస్తుతం జైళ్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు శిష్యురాళ్లపై లైంగికదాడి చేసిన కేసులో డేరా బాబాకు 20 ఏళ్ల శిక్ష పడింది. అప్పట్లో ఈ కేసుల పెను సంచలనం సృష్టించింది. బాబాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండటం, లక్షల్లో అనుచరులు ఉన్న బాబాను అదుపులోకి తీసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం సృష్టించింది. కొంతకాలం పాటు డేరాబాబాపై మీడియాలో కూడా పుంఖాను పుంఖానులుగా వార్త కథనాలు వచ్చాయి. ఆ తర్వాత డేరా బాబా ఉంటున్న జైలు ఇదే.. అతడి పడుకుంటున్న మంచం ఇదే అంటూ కూడా వార్తలు వచ్చాయి. క్రమేపీ బాబాపై మీడియాకు ఆ మాటకొస్తే ప్రజలకు కూడా ఆసక్తి తగ్గిపోయింది. తాజాగా డేరాబాబా పేరు మరోసారి తెరమీదకు వచ్చింది.
అక్టోబర్ 24 న హర్యానా కోర్టు డేరాబాబాకు ఒక రోజు పెరోల్ మంజూరు చేసిందట. డేరా బాబా తల్లి నసీబ్ కౌర్ (85) గుండె జబ్బుతో బాధపడుతున్నదట. ఆమెను చూసేందుకు భార్య పెరోల్ కోసం విజ్ఞప్తి చేసింది. దీంతో కోర్టు పెరొల్ను మంజూరు చేసినట్టు సమాచారం. గురుగ్రామ్‌లో ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని డేరా చీఫ్ కలిశారని అధికారులు శనివారం ధృవీకరించారు. అతన్ని గురుగ్రామ్ ఆసుపత్రికి భారీ భద్రతతో తీసుకెళ్లి సాయంత్రం జైలుకు తీసుకువచ్చినట్లు పోలీసు అధికారి తెలిపారు. 52 ఏళ్ల డేరా బాబా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని చండీగర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోహ్‌తక్‌లోని హై-సెక్యూరిటీ సునారియా జైల్లో ఉన్నారు. బాబాకు పెరోల్ వచ్చిన విషయాన్ని ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది. నిబంధనల ప్రకారమే ఆయనకు పెరోల్ లభించిందని జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా తెలిపారు.