ఉద్యోగులుగా గాడిదలు.. ఏ మున్సిపాలిటీలోనంటే?

Update: 2020-11-15 17:30 GMT
గాడిదలే ఉద్యోగులు అయితే ఎలా ఉంటుంది. మనుషులు చేసే పనులు చేస్తే ఎలా ఉంటుంది. అలాంటిది ఇక్కడ జరుగుతోంది. గాడిదలే ప్రభుత్వ ఉద్యోగులే ప్రజలకు సేవ చేస్తోంది. రిటైర్ అయ్యాక కూడా గాడిదలకు వసతులు అందుతున్నాయి. ఈ వింత మనదేశంలో కాదు.. టర్కీ దేశంలో చోటుచేసుకుంది.

టర్కీలోని అర్తుక్లు పట్టణంలోని మున్సిపాలిటీ విభాగంలో గాడిదలు కూడా ఉద్యోగులే కావడం విశేషం. ఇక్కడ ఇళ్లు చాలా వరకు ఇరుకిరుకుగా ఉంటాయి. అర్తుక్లు మున్సిపాలిటీలో వాహనాలు వెళ్లడం చాలా కష్టం. దీంతో ఒక్కో గాడిద వెంట ఒక్కో పారిశుధ్య కార్మికుడు ఉండి చెత్తను సేకరించి గాడిద మీద ఉన్న సంచుల్లో వేసి డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు.

ఉద్యోగులు గాడిదలకు ఆహారంగా పండ్లు పెట్టడమే కాక రిటైర్ అయ్యాక ప్రభుత్వమే వాటి బాగోగులు చూస్తుంది.

ఇలా ఇరుకున ఇళ్లు ఉన్న పట్టణంలో గాడిదలే ఉద్యోగులయ్యాయి. ఇలాంటి వింతగల పట్టణం టర్కీలో మాత్రమే ఉండడం గమనార్హం. గాడిదలు ఉద్యోగులైన మున్సిపాలిటీగా అర్తుక్లు పేరు గాంచింది.




Tags:    

Similar News