బ్రెజిల్ ను సువిశాలంగా పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి మొదటి డామ్ పెడ్రో. ఈయన బ్రెజిల్ చారిత్రక, రాజకీయ, భౌగోళిక నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన చక్రవర్తి. బ్రెజిల్ స్వాతంత్ర్యం సాధించి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా చక్రవర్తి పెడ్రో1 గుండెను సైనిక విమానంలో పోర్చుగల్ దేశం నుంచి బ్రెజిల్ దేశానికి తరలించారు. అక్కడ సైనిక స్థావరంలో పూర్తి సైనిక లాంఛనాలతో ఈ గుండెకు స్వాగతం పలికారు. ప్రజల సందర్శన కోసం ఆ గుండెను ప్రదర్శించారు. వచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీన బ్రెజిల్ స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత మొదటి చక్రవర్తి పెడ్రో గుండెను తిరిగి పోర్చుగల్ దేవానికి పంపిస్తారు.
డోమ్ పెడ్రో 1798లో పోర్చుగల్ రాచకుటుంబంలో జన్మించాడు. ఆ కాలంలో బ్రెజిల్ దేశం కూడా ఈ రాచకుటుంబం వలస పాలనలో ఉండేది. ఆ కాలంలో పోర్చుగల్ మీద దండెత్తి వచ్చిన ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ బోన పార్టీ సైన్యం నుంచి తప్పించుకోవడానికి పెడ్రో రాచకుటుంబం.. లిస్బన్ నుంచి నాటి పోర్చుగీసు వలస పాలనలో ఉన్న బ్రెజిల్ కు పారిపోయి వచ్చింది. యూరప్ నుంచి ఒక రాచకుటుంబం అమెరికా ఖండంలో అడుగుపెట్టడం అదే తొలిసారి. 1808లో బ్రెజిల్ చేరుకుంది ఈ రాజకుటుంబం. అప్పుడు పెడ్రో వయసు కేవలం 8 ఏళ్లు మాత్రమే.
పెడ్రో సంగీతం నేర్చుకొని విద్వాంసుడయ్యాడు. కవి ఎవారిస్టో రాసిన బ్రెజిల్ స్వాతంత్ర్య గీతాన్ని స్వరపరిచింది చక్రవర్తి పెడ్రోనే.
డోమ్ పెడ్రో తండ్రి కింగ్ జాన్ 1821లో పోర్చుగల్ కు తిరిగి వెళ్లేటప్పుడు అప్పటికి 22 ఏళ్ల వయసున్న తన కుమారుడు మొదటి పెడ్రోను తన ప్రతినిధఇగా బ్రెజిల్ ను పరిపాలించడానికి ఉంచి వెళ్లాడు. అయితే ఏడాది తర్వాత పోర్చుగీసు వలస పాలనలో ఉండడానికి మొదటి పెడ్రో తిరస్కరించాడు. పెడ్రో స్వదేశానికి తిరిగి రావాలన్న డిమాండ్ ను కూడా తిరస్కరించి సంచలనం సృష్టించాడు. పోర్చుగీసు పార్లమెంట్ నిర్ణయాన్ని ధిక్కరించి బ్రెజిల్ దేశ ప్రజల పక్షాన నిలిచాడు. 1822 సెప్టెంబర్ 7వ తేదీన బ్రెజిల్ స్వాతంత్య్ర ప్రకటన చేశారు. ఆ తర్వాత బ్రెజిల్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు.
అనంతరం తన కూతురు పోర్చుగల్ సింహాసనాన్ని అధిష్టించే హక్కు కోసం పోరాడడానికి మొదటి పెడ్రో పోర్చుగల్ వెళ్లాడు. 35 ఏళ్ల వయసులోనే క్షయ వ్యాధి వల్ల చనిపోయాడు. మరణశయ్యపై ఉన్న పెడ్రో చక్రవర్తి తన శరీరం నుంచి గుండెను బయటకు తీసి పోర్టో నగరానికి తీసుకెళ్లాలని కోరాడు. అలా ఆయన గుండె పోర్టో నగరంలోని అవర్ లేడీ ఆఫ్ లాపా చర్చిలో భద్రపరచబడింది. పోర్చుగల్ వాసి అయినా కూడా బ్రెజిల్ ప్రజల కోసం నిలబడి.. స్వాతంత్ర్యాన్ని సుపరిపాలన చేసిన యోధుడిగా పెడ్రో బ్రెజిల్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు.
అందుకే బ్రెజిల్ 150వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం 1972లో మొదటి పెడ్రో భౌతిక కాయాన్ని బ్రెజిల్ కు తరలించారు. ఆ భౌతిక కాయాన్ని సావ్ పా నగరంలో భద్రపరిచారు. ఇప్పుడు మొదటి పెడ్రో గుండెను బ్రెజిల్ కు తెప్పిస్తున్నారు.
అక్టోబర్ 2న బ్రెజిల్ లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేర్ బొల్సొనారా ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీచేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు లులా డి సిల్వా కన్నా వెనుకబడి ఉన్నాడని సర్వేలు తేల్చారు. ఈనేపథ్యంలో బ్రెజిల్ కు స్వాతంత్ర్యం ఇచ్చిన పెడ్రో గుండెను రాజకీయంగా వాడుకునేందుకే దేశానికి తెప్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. రసాయనాలతో భద్రపరిచిన ఆయన గుండెను దేశ ప్రజలకు చూపించి ఓట్లు రాల్చే ఎత్తుగడగా దీన్ని అభివర్ణిస్తున్నారు.