కాస్త ఆలస్యంగా సీన్లోకి వచ్చారు మేకపాటి వారి పెద్దాయన. తెలుగు రాజకీయాల్లో 'మేకపాటి' అన్నంతనే గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబానికి వీర విధేయతను ప్రదర్శించే పొలిటికల్ ఫ్యామిలీ అని. అలాంటిది ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగటం తెలిసిందే. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో విపక్ష తెలుగు దేశం ఒక స్థానాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే.
క్రాస్ ఓటింగ్ పై ఎవరూ ఓపెన్ కాకున్నా.. అధికార వైసీపీ మాత్రం తమ పార్టీకి చెందిన కొందరిని గుర్తించి.. వారి పై వేటు వేయటం తెలిసిందే. అలా వేటు పడిన నేతల్లో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. అయితే.. ఈ ఉదంతం జరిగి కొద్ది రోజులైంది. ఇంతకాలం ఈ అంశం మీద స్పందించకుండా మౌనంగా ఉన్న మేకపాటి వారి పెద్దాయన కమ్ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తాజాగా సీన్లోకి వచ్చారు.
చంద్రశేఖర్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పు పట్టారు. తమ కుటుంబం మొదట్నించి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. మొదట్నించి జగన్ వెంటే నడిచామని.. భవిష్యత్తులోనూ నడుస్తామని చెప్పారు. ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉండి ఉంటే.. తాను సాయం చేస్తానని చెప్పిన విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ క్రాస్ ఓటింగ్ కు పాల్పడి..కుటుంబ పరువును చంద్రశేఖర్ రెడ్డి మంట కలిపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుటుంబానికి ఆత్మకూరు.. ఉదయగిరి నియోజకవర్గాలు రెండూ రెండు కళ్లు లాంటివన్న మేకపాటి నోటి నుంచి మరో ఆసక్తికర ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ తనను అడిగితే చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనారెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వమని అడుగుతానని వెల్లడించారు. వైఎస్ హయాంలో తన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని డెవలప్ చేశాడన్న ఆయన..
"అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. మా కుటుంబం టీడీపీలోకి వెళుతుందని కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో నిజం లేదు" అని తేల్చారు. మరి.. మేకపాటి పెద్దాయన కోరుకున్నట్లుగా సీఎం జగన్ ఏ నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.