ఆ దేశ ప్రధానిపై నిప్పులు చెరిగిన సినీ నటి.. ఫ.. అంటూ పోస్టు!

Update: 2023-01-07 04:44 GMT
రాజకీయం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. మన దేశం విషయానికి వస్తే.. అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ ప్రముఖులపై.. అందునా అధికారం చేతిలో ఉన్న వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ సాహసం చేయరు. భారత్ తో పోలిస్తే.. ప్రాశ్చాత్య దేశాల్లో వాక్ సాత్వంత్య్రం ఎంతో ఎక్కువ.

అలాంటి దేశాలకు చెందిన సినీ ప్రముఖులు కొందరు తమకున్న ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని ఆపుకునే ప్రయత్నం చేయరు. ఎవరేం అనుకుంటారో.. ఏం చేస్తారో? లాంటి ప్రశ్నల్ని వేసుకోకుండా.. తమ మనసుకు తోచింది వెనుకా ముందు ఆలోచించకుండా పెట్టేస్తూ సంచలనాలకు కేరాఫ్ అవుతుంటారు.

తాజాగా ఆ కోవకే చెందుతారు బ్రిటన్ కు చెందిన ప్రముఖ నటి జమీలా జామిల్. తాజాగా ఆమె బ్రిటన్ దేశ ప్రధాని రుషి సునాక్ సంచలన వ్యాఖ్య చేసింది. రాయలేని బూతు తిట్టేస్తూ.. ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టేసింది. రిషి ప్రభుత్వం ప్రజల్ని అణగదొక్కాలని చూస్తుందన్న సంచలన వ్యాఖ్య చేసిన ఆమె భారీ పోస్టు ఒకటి పెట్టేశారు. అందులో మొదలు మొదలే.. ఫ.. అంటూ ఒక భారీ బూతు పదాన్ని అలవోకగా వాడేశారు.

సంపన్న వర్గానికి చెందిన రిషి.. లక్ కొద్దీ దేశ ప్రధానమంత్రి అయ్యారని.. ఆయన మితవాదిగా ఆమె అభివర్ణించారు. ప్రజల్ని రిషి సర్కారు అణగదొక్కాలని చూస్తుందన్న ఆమె.. రిషి సర్కారుది నాయకత్వం కాదు నియంత్రత్వం అంటూ ఫైర్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎందుకంత తీవ్రంగా విరుచుకుపడ్డారు? అన్న ప్రశ్న వేసుకుంటే.. ఆయన సర్కారు తాజాగా బ్రిటన్ ప్రజలు దేశంలో నిరసనలు.. ఆందోళనలు చేపట్టకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రిషి డిసైడ్ అయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే సినీ నటి జమీలా జమిల్ తన సోషల్ మీడియా ఖాతాలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ఉద్యోగాలు.. ఉపాధి అవకాశాలు అందకపోవటంతో ప్రభుత్వం తీరుపై నిరసన చేస్తున్నారని.. దాన్ని అణగదొక్కేందుకు వీలుగా దేశ ప్రజలు నిరసనలు.. ఆందోళనలు చేపట్టకూడదంటూ జీవోను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంత తీవ్రంగా పోస్టు పెట్టిన తర్వాత రిషి సర్కారుపై ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News