అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు సమయపాలన పాటించకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. వారి కోసం పెద్ద ఎత్తున వెయిట్ చేసే వారి విలువైన సమయం వేస్టు అవుతుంది. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ప్రజాజీవనంలో ఉన్న నాయకులకు ఏమున్నా లేకున్నా.. చెప్పిన టైంకు వెళ్లే తీరు తప్పనిసరి. ఈ విషయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ముందు చెప్పాలి. ప్రోగ్రాం ఏదైనా కానీ.. ఆయన నోటి నుంచి ఫలానా టైంకు వస్తానంటే ఇట్టే వచ్చేసేవారు. చివరకు అసెంబ్లీ సమావేశాల్ని సైతం ఉదయం ఎనిమిది గంటలకే మొదలుపెట్టేవారు. దీంతో.. ఆ టైంకు చేరుకోలేక నాయకులు కిందా మీదా పడే వారు.
ఆయన తర్వాత అంతో ఇంతో టైంను ఫాలో అయిన తెలుగు ముఖ్యమంత్రుల్లో కిరణ్ కుమార్ రెడ్డిని చెప్పొచ్చు. చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికంటే సీఎం కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉద్యమ వేళలోనూ.. వస్తానన్న సమయానికి ఏ మాత్రం సంబంధం లేకుండా గంటల కొద్దీ వెయిట్ చేయించి.. వచ్చే అధినేతల్లో ఆయన ముందుంటారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెంతనే ఉండే కర్ణాటక ముఖ్యమంత్రికి చేదు అనుభవం ఎదురైంది.
కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఒక వేడుకను నిర్వహించింది. ఇందులో పదకొండుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత.. మాజీ ఇండియన్ టెన్నిస్ స్టార్ విజయ్ అమృతరాజ్‌లకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్వీడన్ కు చెందిన టెన్నిస్ లెజెండ్ బిజోర్న్ బోర్గ్ కు కూడా సన్మానం ఉంది. అతను తన కెరీర్ ను పీక్స్ లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించి సంచలనంగా మారారు. 27 ఏళ్ల పిన్న వయసులో ఆటకు రిటైర్మెంట్ ఇచ్చారు. తాజాగా అతను బెంగుళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో తన కుమారుడు లియో కోసం బెంగళూరు వచ్చాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కొడుకు ఆటను చూసేందుకు వచ్చిన అతన్ని.. సన్మానానికి పిలిచారు.
అందుకు ఆయన ఓకే చెప్పారు. కానీ.. సన్మాన కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నరకు జరగాల్సి ఉంటే.. సీఎం బొమ్మై 11.15కు వచ్చారు. అయితే.. తన కొడుకు మ్యాచ్ టైం కావటంతో సన్మాన కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. చెప్పిన సమయానికి వచ్చిన ఆయన.. అంతకుమించి ఎక్కువ సేపు టైం వెయిట్ చేయాల్సి రావటంతో ఆయనీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా ప్రాశ్చాత్య దేశాలకు చెందిన వారు టైం విషయంలో చాలా కచ్ఛితంగా ఉంటారు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని మన ప్రముఖులకు ఇలాంటి షాకులు తప్పవు. వేరే కమిట్ మెంట్ల కారణంగా ముఖ్యమంత్రి ఆలస్యంగా వచ్చినట్లు సమర్థించుకున్నా.. జరిగిన పరిణామం ముఖ్యమంత్రి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారిందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.