అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. ఆ మధ్య వెంట వెంటనే మూడు సార్లు సంభవించిన కాల్పుల ఘటనల్లో 22 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. మరోసారి కాల్పులు జరిపాడు ఓ అగంతకుడు. నాలుగేళ్ల బాలిక లక్ష్యంగా తుపాకీ ఎక్కుపెట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రాణాపాయం కలగలేదు. మొత్తం ముగ్గురు గాయపడ్డారు.
శనివారం సాయంత్రం టైమ్స్ స్క్వేర్ ను సందర్శించిన వారిలో ఓ కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి చెందిన పాప పక్కనే ఉన్న దుకాణంలో షాపింగ్ చేస్తోంది. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడో తెలియదుగానీ.. ఓ అగంతకుడు ఉన్నట్టుండి కాల్పులు జరిపాడట. మొత్తం మూడు రౌండ్లు కాల్చినట్టు సమాచారం.
ఈ ఘటనలో ఆ బాలిక గాయపడింది. ఆమెతోపాటు సంబంధంలేని మరో ఇద్దరు మహిళలకూ బుల్లెట్లు తగిలాయట. విషయం తెలుసుకున్న పోలీసులు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమీపంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడు నల్లజాతీయుడిగా గుర్తించారు. ఆ ఫుటేజీని రిలీజ్ చేశారు. నిందితుడిని మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించిన పోలీసులు.. అతడికోసం గాలింపు చర్యలు చేపట్టారు.