బీసీ సంఘం పిటీషన్ పై మండిపడిన హైకోర్టు

Update: 2020-12-12 10:57 GMT
సంబంధం లేకపోయినా ఓ పిటీషన్ వేసిన బీసీ సంఘంపై హైకోర్టు మండిపడింది. హైకోర్టు ఆగ్రహం దెబ్బకు వెంటనే సదరు బీసీ సంఘం తన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నది. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్రప్రభుత్వం గ్రీని సిగ్నల్ ఇచ్చింది. తొందరలోనే ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని, అందుకు మార్గదర్శకాలను విడుదల చేస్తామంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

దాంతో బీసీ సంఘం వెంటనే కోర్టులో ఓ కేసు దాఖలు చేసింది. పోయిన విద్యాసంవత్సరంలో విద్యార్ధుల వివిధ స్కూళ్ళల్లో నమోదైన విద్యార్ధుల  స్ట్రెంగ్త్ ప్రకారమే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ఉండేట్లుగా ఆదేశాలివ్వాలంటూ బీసీ సంఘం తరపున నాగేందర్ రెడ్డి కోర్టును కోరారు. అయితే కేసును విచారించిన సందర్భంగా న్యాయమూర్తికి ఓ విషయం అర్ధంకాలేదు.

ఉపాధ్యాయుల బదిలీలకు బీసీ సంఘానికి సంబంధం ఏమిటో అర్ధంకాలేదు. అదే విషయాన్ని పిటిషనర్ ను ప్రశ్నించారు. దానికి పిటీషనర్ కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాంతో ప్రభుత్వ వ్యవహారాల్లో అసలు బీసీ సంఘానికి సంబంధం ఏమిటంటూ హైకోర్టు మండిపడింది. బదిలీల వ్యవహారాన్ని ప్రభుత్వమే చూసుకుంటుందని కోర్టు స్పష్టం చేసింది. బదిలీల విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగిందని ఉపాధ్యాయులకు అనిపిస్తే వాళ్ళే కోర్టుకొస్తారు కదా అంటూ పిటీషనర్ ను నిలదీసింది.

బీసీ సంఘం పేరుతో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కోర్టును ఆశ్రయిస్తామంటూ కుదరదంటూ తీవ్రంగా హెచ్చరించింది. వెంటనే పిటీషన్ను ఉపసంహరించుకోవాలన్న కోర్టు ఆదేశాల మేరకు పిటీషనర్ తన కేసును వాపసు తీసుకున్నారు. మొత్తానికి కోర్టు స్పందించిన విధానంతో ప్రభుత్వంతో సంబంధం లేకుండానే కోర్టులో కేసులు వేస్తున్న వాళ్ళ సంఖ్య తగ్గుతుందేమో చూడాలి.
Tags:    

Similar News