నేతల కారణంగా తలెత్తిన శాంతిభద్రతల సమస్య

Update: 2020-12-27 14:45 GMT
నేతల ప్రమాణాలు కాదుకానీ విశాఖపట్నం నగరంలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. నేతల సవాళ్ళు, ప్రతిసవాళ్ళ కారణంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ తూర్పు నియోజకవర్గంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీనివల్ల మామూలు జనాలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే భూ ఆక్రమణ విషయంలో టీడీపీ తూర్పు ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

దీనికి సమాధానంగా వెలగపూడి కౌంటర్ ఇస్తు తాను ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదని చెప్పి సాయిబాబా దేవాలయంలో ప్రమాణం చేయటానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. తాను భూఆక్రమణలు చేసినట్లు ఎంపి నిరూపించేట్లయితే సాయిబాబా దేవాలయానికి రావాలంటు సవాలు విసిరారు. మరి విజయసాయి ఈ విషయంలో స్పందించేలోగానే అనకాపల్లి ఎంఎల్ఏ అమరనాథ్ స్పందించేశారు.

ఎంపి తరపున వకాల్త పుచ్చుకున్న ఎంఎల్ఏ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను వెలగపూడి ఆక్రమించుకున్నది వాస్తవమేనన్నారు. ఈ విషయంలో సాయిబాబా దేవాలయంలో ప్రమాణం చేయటానికి తాను సిద్ధమే అన్నారు. అనటమే కాకుండా ఈరోజు ఉదయం సాయిబాబా దేవాలయానికి వచ్చి కూర్చున్నారు. ఎంతసేపు వెయిట్ చేసినా వెలగపూడా రాకపోవటంతో అమరనాద్ వెళ్ళిపోయారు.

ఇదే విషయమై తర్వాత వెలగపూడి మాట్లాడుతూ తాను సవాలు చేసింది ఎంపిని అయితే మధ్యలో అనకాపల్లి ఎంఎల్ఏ ఎందుకు వచ్చారంటూ లాజిక్ లేవదీశారు. ఎంపి స్పందిచని కారణంగానే తాను ఎంఎల్ఏ సవాలును స్వీకరించలేదన్నారు. సరే వీళ్ళ సవాళ్ళు, ప్రతిసవాళ్ళు ఎలాగున్నా సాయిబాబా దేవాలయం దగ్గర ఎప్పుడేమవుతుందో తెలీక ఆ ఏరియాలో పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతం వీళ్ళ వల్ల ఇపుడు ఉద్రిక్తంగా మారిపోయింది.


Tags:    

Similar News