విడుదలకు ముందే పెను సంచలనంగా మారిన 'ది కేరళ స్టోరీ' మూవీ గత వీకెండ్ లో విడుదల కావటం తెలిసిందే. ఈ మూవీని విడుదల కానివ్వకుండా ఉండేందుకు జరిగిన ప్రయత్నాల్ని పక్కన పెడితే.. సినిమా విడుదల కావటం.. మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. రికార్డు కలెక్షన్ల దిశగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు.. ఈ సినిమాను బ్యాన్ చేసే దిశగా కొన్ని రాష్ట్రాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కేరళలోని ఇతర మతస్తులైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే కథాంశంతో రూపొందించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. వాస్తవ అంశాల ఆధారంగాఈ సినిమాను తాము నిర్మించినట్లుగా దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను నిషేధించాలంటూ తమిళనాడులో ఆందోళనలు చేపడుతున్నారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ రాష్ట్రంలో ది కేరళ స్టోరీ మూవీని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం నిర్ణయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు.
నిజమైన ఘటనల ఆధారంగా సినిమాను తాము తీసినట్లు ఆయన చెప్పారు. మరోవైపు తమిళనాడులోనూ సినిమాను బ్యాన్ చేయాలని ఎన్ టీకే పార్టీ అధినేత సీమన్, ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. ఈ తీరును దర్శకుడు విపుల్ షా తప్పు పట్టారు.
ఒక వ్యక్తి బెదిరిస్తే సినిమా ప్రదర్శనను ఆపేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేయాలా? వద్దా? అన్న అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికైతే తమిళనాడులోని మల్టీఫ్లెక్సుల్లో ఈ సినిమా ప్రదర్శనను నిలిపేసేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈ సినిమాను కేరళలోనూ బ్యాన్ చేయాలన్న డిమాండ్ వస్తోంది. మొత్తంగా ఒకటి తర్వాత ఒకటి చొప్పున రాష్ట్రాలు బ్యాన్ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.