హైదరాబాద్ చివరి నిజాం.. చివరకు ఇలా అద్దె గదిలో చనిపోయాడు

Update: 2023-01-18 06:35 GMT
హైదరాబాద్ చివరి నిజాం ముకరమ్ జా.. ఒకప్పుడు అత్యంత కుబేరుడిగా ఉండేవాడు. స్వాతంత్య్రానికి పూర్వంగా హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన ముకరమ్ జా  ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకడిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు  తాజాగా టర్కీలోని మరణించాడు. అది కూడా ఓ అద్దె డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో తనువు చాలించాడు.  ఆయన వయసు 89. 1933లో జన్మించిన ఆయన టర్కీకి వెళ్లి అక్కడ నివసిస్తున్నారు.

1971లో భారత ప్రభుత్వ రాజా భరణాలు రద్దు చేసేంత వరకు 'ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్'గా ఉన్నారు. అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలతో ఆస్తి వివాదాలతో ముకరం ఝా దివాళా తీశారు. ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. కుబేరుడిగా ఉన్న ముకరం ఝా సామాన్యుడిగా మరణించాల్సిన దుస్థితి దాపురించింది.

ముకర్రం జా 1933లో ఫ్రాన్స్‌లో మీర్ హిమాయత్ అలీ ఖాన్ అలియాస్ ఆజం జా బహదూర్‌కు జన్మించాడు. 1948లో ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి ముందు హైదరాబాద్ ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు ముకర్రాం జా మనవడు. ముకర్రాం జా తండ్రి మీర్ ఉస్మాన్ ఖాన్ కు మొదటి కుమారుడు. ముకర్రం జాం తల్లి యువరాణి దుర్రు షెవార్ టర్కీ సుల్తాన్ అబ్దుల్ మెజిద్ II యొక్క చివరి సుల్తాన్ కుమార్తె.

ముకర్రం జా 1954 లో హైదరాబాద్ చివరి నిజాం అయిన  తాత వారసుడిగా ప్రకటించబడ్డాడు. అప్పటి నుండి, అతను హైదరాబాద్ యొక్క ఎనిమిదో మరియు చివరి నిజాంగా గుర్తించబడ్డాడు.

ముకరమ్ జా టర్కీ యువరాణి ఎస్రాను 1959లో మొదటిసారి వివాహం చేసుకున్నారు.  ఈ జంట విడాకులు తీసుకున్నారని, అయితే నిజాం 20 సంవత్సరాల తర్వాత "హైదరాబాద్ వ్యవహారాల నిర్వహణలో సహాయం చేయడానికి" ఆమెను పిలిచారు.

'ది లాస్ట్ నిజాం: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్లీ స్టేట్' పుస్తకాన్ని రాసిన ఆస్ట్రేలియన్ రచయిత ముకరమ్ జా జీవనశైలిని వివరిస్తూ, అతను తన వజ్రాలను కిలోగ్రాముతో, అతని ముత్యాలను ఎకరాల వారీగా లెక్కించాడని చెప్పాడు. టన్ను బంగారు కడ్డీలు" ఉండేవని వివరించాడు.

1971లో ఈయన సంపదను, ఆస్తులను, బిరుదులు ,ప్రైవేట్ పర్సులను ప్రభుత్వం రద్దు చేసే వరకు ప్రిన్స్ ముఖరం జాను అధికారికంగా హైదరాబాద్ ప్రిన్స్ అని పిలిచేవారు. అప్పటివరకు కుబేరుడిగా ఉన్న ముకర్రాం తర్వాత అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలతో ఆస్తి వివాదాలతో ముకరం ఝా దివాళా తీశారు. ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. కుబేరుడిగా ఉన్న ఆయన సామాన్యుడిగా మరణించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News