ఉద్యోగసంఘాలు ఎప్పుడు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెడితేనే డిమాండ్లు సాధించుకోగలుగుతాయి. ఈ విషయం గతంలో చాలాసార్లు నిరూపణైంది. అయితే కొద్దికాలంగా ఉద్యోగసంఘాల్లోని కొందరు నేతలు ప్రభుత్వంతో కుమ్మకైపోయిన కారణంగా ఉద్యోగసంఘాల్లో పోరాట పటమి తగ్గిపోతోంది. ప్రభుత్వం నుండి కొందరు ఉద్యోగసంఘాల నేతలు అందుకుంటున్న అనుచితలబ్ది కారణంగానే ఉద్యోగులందరు ఉద్యమాలనే మరచిపోయారు. చాలాకాలం తర్వాత తమకు అందాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిల కోసం ఉద్యోగసంఘాల నేతలు ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్లు చేయటంతో పాటు కాస్త ఒత్తిడి కూడా మొదలుపెట్టారు.
పదే పదే డిమాండ్లతో పాటు ప్రభుత్వంపై పెట్టిన ఒత్తిడి ఫలించి మొత్తానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగసంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఏపి జేఏసీ, ఏపీ జేఏసీ ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజ వెంకటేశ్వర్లు ఉద్యోగసంఘాల నేతల తరపున సమావేశంలో పాల్గొన్నారు. దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళముందుంచారు. డీఏ బకాయిలు, పెండింగ్ లో ఉన్న పీఆర్సీ విషయాన్ని స్పష్టంగా నేతలు ప్రస్తావించారు.
తమ సమస్యలను, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగసంఘ నేతలు చెప్పారు. గడచిన రెండున్నరేళ్ళుగా ఉద్యోగసంఘాల నేతలతో ప్రభుత్వం తరపున ఇంతగా చర్చలు జరిగింది లేదు. ఉద్యోగసంఘల నేతల సమ్మె అల్టిమేటమ్ కారణంగానే ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వం సలహాదారు భేటీ అయ్యారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షర్లకు పెన్షన్ చెల్లింపు, దసరాకు 11వ పీఆర్సీ వర్తింపచేయటం, సీపీఎస్ వెంటనే రద్దుచేయటం, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించటం లాంటి అనేక డిమాండ్లపై రెండు వర్గాల మధ్య చర్చ జరిగింది.
ఇంతకాలంగా తాము డిమాండ్లు చేస్తుండటమే కానీ ప్రభుత్వం వైపు నుండి సానుకూలంగా స్పందన రాలేదు. ఇదే విషయాన్ని ఉద్యోగులు తమ నేతలతో తరచు ప్రస్తావిస్తున్నారు. ఇటు ప్రభుత్వాన్ని భేటీకి ఒప్పించలేక అటు ఉద్యోగులకు సరైన సమాధానం చెప్పుకోలేక ఉద్యోగసంఘాల నేతలు నానా అవస్తలు పడుతున్నారు. మొత్తానికి ఇంత కాలానికి ఉద్యోగసంఘాల నేతల ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం చర్చలకు దిగొచ్చింది. మరి పరిష్కారం ఎప్పుడవుతుందో చూడాల్సిందే.