కేరళ లో సంచలనం సృష్టించిన భార్యల మార్పిడి కేసులో ప్రధాన నిందితుడు షినో మాథ్యూ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం అతడి భార్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే షినో మాథ్యూ విషం సేవించాడు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. వారం రోజుల క్రితం షినో మాథ్యూ విషం సేవించి ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చేరినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మే 30న తెల్లవారుజామున మృతి చెందాడు.
కాగా వారం క్రితం నిందితుడి భార్యను ఆమె ఇంటి వద్దే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. తన ఇంట్లో ఉంటున్న తన కుమార్తె ను హత్య చేసింది.. అల్లుడేన ని మృతురాలి తండ్రి ఆరోపించారు. మే 19న కేరళలో మానర్‌కాడు లోని ఇంట్లో ఆమె రక్తపు మడుగులో పడి ఉండడాన్ని ఆమె పిల్లలే మొదట గుర్తించారు.
వివాహిత తండ్రి, సోదరుడు పనికి వెళ్లి, పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది జనవరి లో వైఫ్ స్వాపింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసు లు అరెస్టు చేశారు. ఈ కేసులో మహిళ భర్త సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జీవిత భాగస్వాములను మార్చుకుని శృంగారం చేయడానికి తన భర్త అలవాటు పడ్డాడని.. తనను కూడా బలవంతం చేస్తున్నాడని, అతడి స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేస్తున్నాడని 26 ఏళ్ల కేరళ వివాహిత జనవరిలోనే పోలీసుల కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళ భర్త తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటి నుంచి భర్త కు దూరంగా ఉంటున్న ఆ మహిళ కొట్టాయం లోని పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో మే 19న ఆమె తండ్రి, సోదరుడు పనికి వెళ్లగా, పిల్లలు ఆడుకోవడానికి వెళ్లారు. కాసేపటి తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి చూడగా, ఆమె రక్తపు మడుగులో పడి కనిపించింది. తన కుమార్తెను ఆమె భర్తే చంపి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జీవిత భాగస్వాముల ను మార్చుకుని శృంగారం కుంభ కోణం వ్యవహారంలో కొట్టాయం, అలప్పుజా, ఎర్నాకులంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఎఫ్‌ఐఆర్ లు నమోదయ్యాయి. జనవరి 2023లో కేసు పెట్టే సమయానికి ఆమె కారుకాచల్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో తన పిల్లల ను తీసుకుని ఆమె కుటుంబం మనర్ కాడ్ పోలీసు పరిధిలోని మరొక ప్రదేశానికి మారింది.
మహిళ ఫిర్యాదు పై పోలీసుల విచారణ నిర్వహించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. సోషల్ మీడియా ద్వారా నిర్వహిస్తున్న పార్టనర్–స్వాపింగ్ రాకెట్ లో చాలా మంది జంటలు భాగమని తేలింది.
కాగా మృతి చెందిన మహిళ కు ఆరేళ్లు, మూడేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు భర్త కోసం ప్రత్యేక గాలింపు బృందాల ను ఏర్పాటు చేశారు. దీంతో ఆందోళనకు గురయిన అతడు విషం సేవించి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.