మొగుడిని మోసం చేస్తున్నారు.. ఇండియాలో ఎంత మంది ఉన్నారో తెలుసా?

Update: 2021-03-07 23:30 GMT
పెళ్లంటే ఒక న‌మ్మ‌కం.. క‌ష్టాల్లో, సుఖాల్లో క‌డ‌వ‌ర‌కూ తోడుంటాన‌ని ఆడ‌-మ‌గ చేసే ఓ వాగ్ధానం.. అయితే.. ఈ న‌మ్మ‌కం స‌డ‌లుతోంది! ప్ర‌పంచంలోనే బ‌ల‌మైన‌ద‌ని చెప్పుకునే భార‌తీయ వివాహ వ్య‌వ‌స్థ‌కు చెద‌లు ప‌డుతోంది! న‌లుగురికి తెలిసేలా ఒక‌రిని వివాహం చేసుకుంటున్న‌వారు.. నాలుగు గోడ‌ల మ‌ధ్య మ‌రొక‌రితో కాపురం చేస్తున్నారు! పాత రోజుల్లో ఎక్క‌డో ఒక‌చోట సాగిన ఈ తంతు.. ఆధునిక యుగంలో వేగంగా విస్త‌రిస్తోంది. తాము భ‌ర్త‌తో కాకుండా మ‌రొక‌రితో శారీరక‌ సుఖాన్ని అనుభ‌వించామ‌ని, ఇంకా పొందుతూనే ఉన్నామ‌ని చెప్పేవారి సంఖ్యే ఇందుకు నిద‌ర్శ‌నం.

పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ‌గా ఉండే ఈ విశృంఖ‌ల వ్య‌వ‌హారం.. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇండియాలోనూ వేగంగా వృద్ధి చెందుతోంది. తాజాగా.. ఓ ఆన్ లైన్ డేటింగ్ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ అవాంఛ‌నీయ వృద్ధిరేటు బ‌య‌ట‌ప‌డింది. ఫ్రెంచ్ ఎక్స్ ట్రా - మారిట‌ల్ డేటింగ్ యాప్ గ్లీడెన్ ను కొంద‌రు మ‌హిళ‌లు డెవ‌ల‌ప్ చేశారు. ఈ యాప్ నిర్వ‌హ‌ణ కూడా లేడీసే చూస్తుంటారు. ఈ యాప్ లో దాదాపు 13 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు స‌భ్య‌త్వం ఉంది.

కాగా.. ఇటీవ‌ల సెక్స్ విష‌య‌మై ఈ యాప్ స‌ర్వే చేప‌ట్టింది. ఇందులో భాగ‌స్వామితో పొందుతున్న సెక్స్ సుఖంతో స‌మానంగా.. ఇత‌రుల‌తోనూ పొందుతున్న‌ట్టు చాలా మంది మ‌హిళ‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 30 సంవ‌త్స‌రాల నుంచి 60 ఏళ్ల‌లోపు మ‌ధ్య ఉన్న మ‌హిళ‌ల్లో దాదాపు 48 శాతం మంది త‌మ‌కు వివాహేత‌ర సంబంధాలు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఉన్న‌వారు కూడా ఇత‌ర వ్య‌క్తుల‌తో సంభోగిస్తున్న‌ట్టు ఒప్పుకున్నారు.

అయితే.. ఇలా ఒప్పుకున్న వారిలో 64 శాతం మంది త‌మ‌కు భ‌ర్త ద‌గ్గ‌ర శృంగారాన్ని ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం. అయితే.. వీరంతా బాగా చ‌దువుకున్న‌వారు, లేదా బాగా డ‌బ్బున్న‌వారు కావ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. ఆర్థిక స్వాతంత్రం క‌లిగిన వారు 77 శాతం మంది, బాగా చ‌దువుకున్న వారు 76 శాతం మంది ఈ గోడ‌దూకుడు వ్య‌వ‌హారాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు స‌ర్వే తేల్చింది.
Tags:    

Similar News