మీరు నాన్ వెజ్ తింటారా? మిస్ కాకుండా చదవండి

Update: 2021-08-26 23:30 GMT
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ వినియోగం ఎక్కువ. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే.. మరి వారు తినే నాన్ వెజ్ లో ఆరోగ్యం పాళ్లు ఎంత? అన్నది అసలు ప్రశ్న. తాజాగా దీనికి సమాధానం మాత్రమే కాదు.. మరిన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సుఖదేవ్ బర్బుద్దే.

నాన్ వెజ్ తినే వారి మీదా.. దాన్ని అమ్మే వారి మీద ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా వారు పలు అంశాల్ని గుర్తించారు. అన్నింటికి మించి మాంసం నాణ్యత విషయంలో ఆయన కొన్ని సందేహాల్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజుకు సగటున 50 వేల వరకు గొర్రెలు..మేకల్ని అమ్మకాలు సాగుతున్నాయని చెప్పారు. దేశంలో అమ్ముడయ్యే మొత్తం గొర్రెలు.. మేకల మాంసంలో 60 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే కొంటున్న వైనాన్ని గుర్తించారు.

గొర్రెలు.. మేకలు.. కోళ్లతో పాటు గేదెలతో పాటు ఇతర మాంసాన్ని కలిసి చూసినా యూపీ.. బెంగాల్.. ఏపీ..
తెలంగాణ.. మహారాష్టాలే యాభై శాతానికి పైగా మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. గొర్రె కానీ మేక కాని కోడి కాని దాన్ని కోసిన మూడు గంటల్లోపే ఆ మాంసాన్ని వండేయాలి. అలా వండకుండా తొమ్మిది గంటల తర్వాత నుంచి బ్యాక్టీరియా పెరిగి కుళ్లటం మొదలవుతుంది. అలా వండని పక్షంలో సున్నా నుంచి మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్ (అతి శీతలీకరణ)లో ఉంచాలి. ఒకవేళ 24 గంటల తర్వాత కోసిన మాంసాన్ని వాడాలనుకుంటే మాత్రం కనీసం మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద దాన్ని నిల్వ చేయాలి.

కానీ.. చాలా దుకాణాల్లో తెల్లవారుజామున కోసి.. రోజు మొత్తం అమ్ముతుంటారు. రోడ్డు పక్కనే మాంసాన్ని వేలాడదీసి అమ్మటం ఏ మాత్రం మంచిది కాదు. అలాంటి మాంసాన్ని తింటే ఆరోగ్య సమస్యలు రావటం ఖాయం. సో.. వాడే మాంసాన్ని కొనుగోలు చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. వీటిల్లో ఏ ఒక్కటి మిస్ కాకూడదు.


Tags:    

Similar News