కరోనా నేపథ్యంలో నెలసరిగా కట్టాల్సిన బ్యాంక్ రుణాల్ని కట్టకుండా మారిటోరియం ఆఫర్ ను రిజర్వు బ్యాంక్ ప్రకటించటం తెలిసిందే. ఈ ఆఫర్ నను వినియోగించుకున్న రుణ గ్రహీతల నుంచి వడ్డీ మీద వడ్డీ వసూలు చేసే తీరు చర్చనీయాంశంగా మారటమే కాదు.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వడ్డీ మీద వడ్డీ వసూలు చేయమని కేంద్రం ప్రకటించటం తెలిసిందే. దీంతో.. ఆర్నెల్ల పాటు సాగిన మారిటోరియం బెనిఫిట్ పొందినోళ్లు బెనిఫిట్ పొందటం దాదాపు ఖరారైంది. అదే సమయంలో వడ్డీ మీద వడ్డీ భారం పడుతుందన్న భయంతో ఏ నెలకు ఆ నెల కష్టమైనా ఈవీఎంలను కట్టేసినోళ్లు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇలాంటి వారికి మేలు కలిగించేలా మోడీ సర్కారు ఒక స్వీట్ న్యూస్ చెప్పేందుకు వీలుగా కసరత్తు చేస్తుందని చెబుతున్నారు. ఏ నెలకు ఆ నెల కచ్ఛితంగా లోన్ ఈఎంఐలు కట్టిన వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తారని చెబుతున్నారు. లోన్ పక్కాగా కట్టిన వారికి క్యాష్ బ్యాక్ అందించాలన్న ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఆఫర్ రూ.2కోట్ల మేర రుణాలు తీసుకున్న వారికి వర్తిస్తుందని చెబుతున్నారు.
లోన్ మారిటోరియం వినియోగించుకున్న వారికి లాభం చేకూర్చినప్పుడు.. వినియోగించని వారికి సైతం మేలు చేయాల్సిన అవసరం ఉందన్న వాదనకు కేంద్రం కన్వీన్స్ అయినట్లుగా చెబుతున్నారు. మారిటోరియం బెనిఫిట్ పొందిన వారి విషయంలో సుప్రీంకోర్టు తుది ఆదేశాలు జారీ చేసిన తర్వాతే.. ఈఎంఐలను కచ్ఛితంగా చెల్లించిన వారి విషయంలో కీలక ప్రకటనను కేంద్రం చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. సదరు రుణ గ్రహీతలు హ్యాపీగా ఫీల్ కావటం ఖాయం.