దేశంలో వినియోగించే ముడిచమురులో సింహభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో కీలక నిర్ణయాన్ని తీసుకున్న మోడీ సర్కారు కారణంగా దేశానికి రూ.5వేల కోట్లు ఆదా అయినట్లుగా చెబుతున్నారు.మోడీని అమితంగా ఆరాధించే వారికి.. మోడీ ప్రధానిగా ఉండటం ద్వారా దేశానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని చెప్పే వారి చేతికి తాజా సమాచారం ఒక అస్త్రంగా మారుతుందని చెప్పక తప్పదు.
దేశంలో వినియోగించే ముడిచమురును ఇటీవల భారీగా కొనుగోలు చేసింది మోడీ సర్కారు. ఇందుకోసం అదనంగా రూ.3874 కోట్లను ఖర్చు చేసింది.ఆ మధ్య వరకు బ్యారెల్ ముడిచమురు 60 డాలర్లు ఉండగా.. కరోనా దెబ్బకు పాతాళానికి చేరుకున్నాయి ముడిచమురు ధరలు. కరోనా దెబ్బకు బ్యారెల్ ముడిచమురు 19డాలర్లకు పడిపోయింది. దీంతో.. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు వీలుగా మోడీ ప్రభుత్వం.. 16.71 మిలియన్ బ్యారెళ్ల చమురును అదనంగా కొనుగోలు చేసింది.
ఇంత భారీగా కొనుగోలు చేసిన ముడిచమురును విశాఖ.. మంగళూరు.. పదూర్ చమురు క్షేత్రాల్లో నిల్వ ఉంచింది. ఇంత భారీగా చమురుకొనటం ద్వారా భారత్ కు రూ.5వేల కోట్ల మేర ఆదా అయినట్లుగా చెబుతుున్నారు. సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా భారీ మొత్తాన్ని ఆదా చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం మోడీ వాదులకు ఒక అస్త్రంగా మారటమే కాదు.. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ పోస్టులకు ముడిసరుకుగా మారుతుందని చెప్పక తప్పదు.