డెల్టాక్రాన్... వెలుగు చూసిన కొత్త వేరియంట్...!!!

Update: 2022-01-10 03:44 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. సుమారు 22 లక్షల కేసులు ప్రపంచ వ్యాప్తంగా నిర్ధరణ అయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరో వైపు వైరస్​ మరణాలు సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతుంది. తాజాగా మరో నాలుగు వేల మంది వైరస్​ సోకిన కారణంగా చనిపోయారు. ఇప్పటి వరకు వైరస్​ బారిన పడిన వారి జాబితా 30 కోట్లు దాటింది. వివిధ దేశాలు వైరస్​ ను అడ్డుకునేందుకు టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశాయి. కొన్ని దేశాలు ఇప్పటికే బూస్టర్​ డోసును కూడా ఆ దేశ పౌరులకు ఇప్పించాయి. కానీ వైరస్ కేసు సంఖ్య తగ్గు ముఖం పట్టడం లేదు. మన దేశంలో కూడా కరోనా వైరస్​ కేసుల భారీగా వెలుగు చూస్తున్నాయి. ఈ ఒక్క రోజే సుమారు లక్షా 57 వేల కేసులు బయటపడ్డాయి. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు పది శాతాన్ని దాటింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్  కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూపోతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు వెలుగు చూశాయి.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ కు సంబంధించిన మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. దీనిని సైప్రస్ లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.  కొత్తగా బయటపడిన వైరస్ లో కరోనా కు సంబంధించిన రెండు వేరియంట్లలో తాలూకు ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత్ లో రెండో వేవ్ సమయంలో బీభత్సం సృష్టించిన డెల్టా వేరియంట్ జన్యువులు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా మరో వేరియంట్ అయిన ఒమిక్రాన్ కు సంబంధించిన జన్యువులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్ కు ఏ పేరు పెట్టలేదని పరిశోధకులు చెబుతున్నారు అయితే ఈ వేరియంట్ లో గత రెండు వేరియంట్ల తాలూకు ఆనవాళ్లు ఉండడంతో దీనికి ఆ రెండింటి పేరు వచ్చేలాగా డెల్టాక్రాన్ అని పెట్టారు. త్వరలోనే దీనికి శాస్త్రీయ నామం పెట్టనున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా వెలుగుచూసిన వేరియంట్ తో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి మిగతా వాటి కంటే తక్కువగానే ఉన్నట్లు అంచనా వేశారు. సైప్రస్ లో సేకరించిన సుమారు 25 నమూనాల్లో కేవలం కొత్త వేరియంట్ లో  10 మ్యుటేషన్లు మాత్రమే కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ 25 నమూనాలలో 14 ఆసుపత్రిలో చేరిన వారివి కాగా మిగతా 11 బయట వారివి.  అయితే 14 మంది నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్ మ్యూటేషన్లు ఎక్కువ ఉన్నట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా అని ఈ వేరియంట్ కారణంగా ఆసుపత్రి పాలు అయ్యే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని చెప్పలేము అని అంటున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా లేవని అన్నారు. కొత్త వేరియంట్ లో జన్యుపరంగా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు ఉన్నప్పటికీ నమోదు అయ్యే కేసుల సంఖ్య అంతంత మాత్రంగా ఉందని వివరించారు.
Tags:    

Similar News