ఎక్కడున్నా ప్యాకేజీ ఇవ్వాల్సిందే

Update: 2022-08-12 00:30 GMT
పోలవరం ముంపు గ్రామస్తులు ఎక్కడున్నా వారికి పరిహారం ఇవ్వాల్సిందే అని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు రాజకీయ కారణాలతో పరిహారం ఇవ్వటానికి నిరాకరిస్తున్నారని జ్యోతి అనే మహిళ హైకోర్టులో పిటీషన్ వేసింది.

ఈ పిటీషన్ను విచారించిన హైకోర్టు ముంపు గ్రామస్తులు ఎక్కడున్నా పరిహారం ఇచ్చితీరాల్సిందే అని ఆదేశించింది. చాలామంది ముంపుగ్రామాల జనాలు ఇతర గ్రామాల్లో ఉపాధికోసం వెళ్ళిపోయారు.

ఎలాగూ ముంపుగ్రామాల్లో ఉండటం లేదుకాబట్టి పరిహారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు జ్యోతి తన పిటీషన్లో ఆరోపించారు. పిటీషనర్ వాదనలు విన్నతర్వాత పరిహారం ఇవ్వాల్సిందే అని హైకోర్టు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల జనాలకు పునారవాసం, ప్యాకేజీ అందించటం అనేది పెద్ద సమస్య అయిపోయింది.  గ్రామస్తులకు పునరావాసం చెల్లించాలంటే వేలకోట్ల రూపాయలు వ్యయం అవుతుంది.

మామూలుగా ప్రాజెక్టు అంటే డ్యాం నిర్మాణం మాత్రమే కాకుండా కాల్వల తవ్వకం కోసం అయ్యే వ్యయం, భూసేకరణ, భూములిచ్చిన వారికి పరిహారం చెల్లించటం, భూములు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించటం అన్నీ ప్రాజెక్టు వ్యయంలోనే వస్తుంది.

అయితే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన వ్యయం మాత్రమే ఇస్తామని, పునరావాసం, పరిహారం ఇచ్చేదిలేదని కేంద్రప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల మొత్తం వ్యయం రాష్ట్రప్రభుత్వం మీదే పడుతోంది. ఇంత భారీ వ్యయాన్ని భరించేస్ధితిలో రాష్ట్రప్రభుత్వం లేదు. ఈ కారణంగానే చంద్రబాబునాయుడు కూడా పునరావాసం, ముంపు గ్రామస్తులకు పరిహారం ఇచ్చే విషయాన్ని పక్కనపెట్టేశారు.

ఇపుడు జ్యోతి అనే మహిళ హైకోర్టులో కేసు వేయటమే ఆశ్చర్యంగా ఉంది. ముంపుగ్రామాల్లో ఉండని గ్రామస్తులకు పరిహారం చెల్లించేదిలేదని ప్రభుత్వమైతే ఎప్పుడు ప్రకటించినట్లులేదు. అయినా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయటమే ఆశ్చర్యంగా ఉంది. సరే ఏదేమైనా ముంపుగ్రామాల్లో ఉండని వారికి కూడా ప్యాకేజీ ఇచ్చితీరాల్సిందే అని హైకోర్టు చెప్పింది కాబట్టి ప్రభుత్వం పరిహారం అందిస్తుంది.
Tags:    

Similar News