అక్కడెక్కడో అల్లంత దూరాన.. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మాయదారి రోగం బారిన పడినట్లుగా వార్తల్లో చదివినప్పుడు చాలామందికి ఆశ్చర్యమేసేది. ప్రముఖులు అన్న తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరెన్నో రక్షణ చర్యలు చేపడతారు. అలాంటి వారి దగ్గరికి మాహమ్మారి ఎలా వెళ్లగలుగుతుందన్న సందేహం వచ్చేది. ఎప్పుడైతే.. మాయదారి రోగం మన దేశానికి వచ్చేయటమే కాదు.. పలువురు ప్రముఖుల్ని పట్టేస్తుందో.. అప్పటికి కాని విషయం బోధ పడని పరిస్థితి.
ఎక్కడిదాకానో ఎందుకు? తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు సంగతే తీసుకుంటే.. తాజాగా పాజిటివ్ బారిన పడి నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పాజిటివ్ రావటానికి కారణం ఆయన అనుసరించిన విధానాలే అని చెప్పాలి. డెబ్భై ప్లస్ లో ఉన్న ఆయన.. వెనుకా ముందు చూసుకోకుండా వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లోనూ.. ఆందోళనల్లోనూ పాలు పంచుకున్నారు.
వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా భౌతికదూరాన్ని పాటించకుండా వ్యవహరించారు. దీంతో ప్రమాదానికి దగ్గరగా వెళుతున్నట్లుగా పలువురు అంచనా వేశారు. ఇదే మాత్రం తప్పు కాదన్నట్లు ఇప్పుడాయన పాజిటివ్ గా కన్ఫర్మ్ అయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీహెచ్ బాటలో నడిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇటీవల నిర్వహించిన టెస్టులో నెగిటివ్ గా తేలింది. ఆయన కూడా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అధికార పార్టీలో.. అందునా హైదరాబాద్ మహానగరంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ కూడా తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. మంత్రి హోదాలో ఉన్నప్పటికి మహమ్మారి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మిగిలిన టీఆర్ఎస్ నేతలతో పోలిస్తే.. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. పలు కార్యక్రమాల్లో పాల్గొనటమే కాదు.. పలు రివ్యూల్ని నిర్వహించారు. చాలా మందితో భేటీలయ్యారు.
తాజాగా ఆయనకు దగ్గరగా ఉండే ఒక కార్పొరేటర్ కు.. వారి కుటుంబ సభ్యుల్లో ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. తలసాని ప్రాతినిధ్యం వహించే సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్ కావటంతో.. ఆయన నిర్వహించే రోజువారీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా హాజరవుతారని చెబుతున్నారు. తాజాగా సదరు కార్పొరేటర్ కుటుంబంలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో.. తలసాని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. గతానికి భిన్నంగా కాస్త స్పీడ్ తగ్గించి.. పరిమిత సంఖ్యలో కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. తనకు తోచినట్లు మాత్రమే వ్యవహరించే మంత్రి తలసాని లాంటి వారికి ఇలాంటి సూచనల్ని చెవికెక్కించుకుంటారో లేదో కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పాలి.