హైకోర్టు ఆగ్రహం పుణ్యమా అని బయటకొచ్చిన షాకింగ్ నిజం

Update: 2021-11-17 05:10 GMT
అదో భిన్నమైన ఉదంతం. కోట్లాది మంది జీవితాల్ని నిలబెడుతున్న కరోనా వ్యాక్సిన్.. కొందరికి సిత్రమైన అనుభవాల్ని మిగిలుస్తోంది. ఈ విషయంలో కేంద్రం స్పందిస్తున్న తీరు కూడా కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీకాను ఇస్తున్న కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి కారణంగా కొత్త సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఒక విచిత్రమైన ఉదంతం తాజాగా కేరళ హైకోర్టు ప్రస్తావించి.. ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఈ విషయం చర్చకు వచ్చింది.

ఇంతకూ జరిగిందేమంటే..

సౌదీ అరేబియాలో వెల్డర్ గా పని చేస్తున్న కేరళ వాసి ఒకరు తన సొంత రాష్ట్రానికి వచ్చాడు. అనంతరం అతడు మిగిలిన వారి మాదిరే కొవిడ్ టీకాను వేయించుకున్నారు. కొవాగ్జిన్ రెండు డోసుల్ని వేసుకున్న తర్వాత నుంచి అతను పని చేస్తున్న సౌదీకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం.. సదరు కొవాగ్జిన్ టీకాను సౌదీ ప్రభుత్వం గుర్తించకపోవటమే.

దీంతో అతను తిరిగి వెళ్లలేకపోతున్నాడు. దీనికి సంబంధించి తనకు న్యాయం చేయాలంటూ సదరు వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన టీకా కారణంగా ఒక పౌరుడు తన జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి రావటం ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు.. జాబ్ పోయే పరిస్థితి అంటే ప్రాధమిక హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు.

ఈ ఉదంతంపై జస్టిస్ పీవీ కున్షిక్రిష్ణన్ విచారణ జరిపారు. తాము కేంద్రాన్ని తప్పు పట్టటం లేదంటూనే.. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు పలు దేశాలు అనుమతి ఇవ్వని నేపథ్యంలో.. ఆ టీకాల్ని వేసుకున్న వారంతా ఆయా దేశాలకు వెళ్లలేని పరిస్థితి. దీంతో.. పలువురు ఇబ్బందికర పరిస్థితుల్ని పలువురు ఎదుర్కొంటున్నారు.

ఒక వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చినప్పుడు.. మిగిలిన దేశాలు ఆ వ్యాక్సిన్ కు అనుమతించేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్రం మీదా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. కేరళ హైకోర్టును ఆశ్రయించిన బాధితుడి కేసు విచారణను ఈ నెల 29కు వాయిదా వేశారు. ఆ సమయానికి తగిన పరిష్కారంతో కేంద్రం రావాలని హైకోర్టు కోరింది. మరి.. దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News