అవును మీరు చదివింది నిజమే. చంద్రగిరి నియోజకవర్గంలోని కందులవారి పల్లెలో చంద్రబాబునాయుడు సోదరి హైమవతి ఉంటారు. బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా పోలీసులు ఆమె ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఇంట్లో లేకపోవటంతో కాంపౌండ్ అంతా తిరిగి ఫొటోలు తీసుకుని వెళ్ళిపోయారు. దాంతో కందులవారిపాలెంలో కలకలం రేగింది.
ఇంటికి తిరిగివచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న హైమవతి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళవారం ఉదయం అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మాజీమంత్రి నారాయణకు నోటీసు ఇవ్వటమే కాకుండా ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు సోదరి ఇంటికి పోలీసులు వెళ్ళటం సంచలనంగా మారింది.
అయితే ఇదే విషయంపై పోలీసులు వివరణిస్తు పొరబాటున చంద్రబాబు సోదరి ఇంట్లోకి ప్రవేశిచింనట్లు చెప్పారు. కందులవారిపల్లెలోనే చదలవాడ సుచరిత అనే మహిళపై ఫిర్యాదులు వచ్చాయట. ఆమె ఇంటికి వెళ్ళాల్సిన తమ సిబ్బంది పొరబాటున హైమవతి ఇంటికి వెళ్ళినట్లు చెప్పారు. ఎందుకంటే హైమవతి కూతురు పేరు కూడా సుచరితే అని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల వివరణతో జనాలు కన్వీన్స్ కాలేదు లేండి.