ఆ మాస్క్ ధరిస్తే.. కరోనాను ఖతమ్ చేస్తుందట

Update: 2020-08-15 06:00 GMT
ఇప్పుడంతా కరోనా కాలం. ఆ మాటకు వస్తే.. రాబోయేది కరోనా కాలమే. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్ని చూస్తుంటే.. భవిష్యత్తులో కరోనాకు ముందు.. కరోనా తర్వాత అనే విభజన చాలా స్పష్టంగా ఉంటుందని చెప్పక తప్పదు. మొదట్లో ఈ విషయాన్ని కాస్త ఫన్నీగా చెబితే.. ఇప్పుడది సీరియస్ గా మారటమే కాదు.. రానున్న రోజుల్లో కరోనా కారణంగా మరిన్ని విషమ పరీక్షలు ఎదురుకావటం ఖాయమంటున్నారు. ఇలాంటి వేళలో కరోనా పీచమణిచే మరిన్ని ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా దరి చేరకుండా ఉండటానికి.. ఒకవేళ చేరినా.. వెంటనే వాటిని ఖతమ్ చేసే సాంకేతికతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మనోళ్లు ఇప్పటికే ఒక ఎలక్ట్రికల్ మాస్కును రూపొందించారు. జాదవ్ పూర్ వర్సిటీకి చెందిన విద్యార్థులు రూపొందించిన ఈ మాస్కు మిగిలిన వాటికి పూర్తి భిన్నమైనది.

ఈ మాస్కు ధరించిన తర్వాత.. సదరు వ్యక్తి చుట్టూ ఒక విద్యుదయస్కాంత క్షేత్రాన్నిక్రియేట్ చేస్తుందట. దీంతో.. కరోనాతో సహా మరెలాంటి వైరస్ అయినా.. సదరు వ్యక్తికి దగ్గరగా వెళ్లినంతనే.. మాస్కుకు ఉండే మ్యాగ్నెట్ పవర్ కు నాశనం చేస్తుందని చెబుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ మాస్కు డిజైన్ ను ఐసీఎంఆర్ అనుమతుల కోసం పంపినట్లు చెబుతున్నారు. వారి నుంచి అనుమతి రాగానే.. దీని తయారీ మొదలు పెడతామని చెబుతుున్నారు. ఒకవేళ.. ఐసీఎంఆర్ కానీ ఓకే చెబితే.. కరోనా ఖతం పెట్టేందుకు భారీ అడుగు ఒకటి విజయవంతంగా పడినట్లై అవుతుందని చెప్పాలి. మరీ మాస్కు విషయంలో ఐసీఎంఆర్ ఏం చెబుతుందో చూడాలి.
Tags:    

Similar News