దేశంలో మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. దేశంలో కట్టుదిట్టమైన చర్యలు అమలు అవుతున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసులు అధిక సంఖ్య లో నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్ తయారీ కోసం సైంటిస్టులు, పరిశోధకులు రేయింబవళ్లు కష్టపడుతుంటే.. మరికొందరు మాత్రం ఇది చేస్తే కరోనా పోతుంది... అది తాగితే కరోనా రాదన్న భ్రమల్లో బతుకుతున్నారు
ఈ నేపథ్యంలో వైరస్ అంతం కోసం ఓ పూజారి ఘోరాతి ఘోరమైన నరబలికి పాల్పడ్డాడు. దేశంలోని ప్రజలు ఈ వైరస్ భారిన పడుతున్నారని ఓ మనిషినే బలి ఇచ్చేసాడు. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న అంత్యంత ఘోరమైన ఘటన ఒడిశాలోని కటక్ జిల్లా నర్శింగ్ పూర్ లో చోటుచేసుకుంది. బంధహూడ సమీపంలో ఉన్న బ్రాహ్మణిదేవి ఆలయంలో ఈ పాశవిక చర్య జరిగింది. వైరస్ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని సంసారీ ఓజా అనే 72 ఏళ్ల బ్రాహ్మణిదేవీ దేవాలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఈ ఘటన తెలిసి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా..ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి కాపాడాలనే ఈ పనిచేశానని అంటున్నాడు ఈ మూర్ఖత్వపు అర్చకుడు. అయితే అతడు ఎవర్ని నరబలి ఇచ్చాడన్న విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు.