'రైజర్స్' తాజా బౌలింగ్ సంచలనం.. తంగరసు నటరాజన్

Update: 2020-10-14 09:50 GMT
కడు పేదరికం. ఇరుకైన గదిలో నివాసం. తండ్రి దినసరి కూలీ. తల్లి రోడ్డు పక్కన చికెన్ అమ్మకం.. తినడానికి.. బతకడానికి.. ఒంటిపై బట్ట కట్టడానికి.. అన్నింటికీ కష్టాలే. సర్కారీ బడిలో పెట్టే ఉచిత భోజనమే పరమాన్నం. అన్ని కష్టాల్లోనూ అతడు పట్టిన క్రికెట్ బంతి వదల్లేదు.. ఆటే జీవితంగా బతికాడు. ఇప్పుడు అదే ఆట దేశమంతా అతడిని గుర్తిస్తోంది. అతడు ఎవరో కాదు.. తన పదునైన యార్కర్లతో బ్యాట్స్ మెన్లను  వణికిస్తున్న సన్ రైజర్స్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తంగరసు నటరాజన్.

 నటరాజన్ ది  తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలోని చిన్న పల్లెటూరు చిన్నప్పంపట్టి. ఈ గ్రామానికి చెన్నై 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. వారిది నిరుపేద కుటుంబం.నటరాజన్ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా.. అందులో మొదటివాడు నటరాజన్. చిన్నప్పట్నుంచి నట్రాజ్ ఎందుకు క్రికెట్ అంటే పిచ్చి. చుట్టుపక్కల ఏ గ్రామం లో క్రికెట్ ఆడినా  అక్కడికి వాలిపోయేవాడు. ఇక క్రికెట్ సీజన్ వచ్చిందంటే చాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నటరాజన్ క్రికెట్ ఆడుతూనే ఉంటాడు.

తల్లిదండ్రులు ఏరోజు అతడు ఇష్టాన్ని కాదనలేదు. నటరాజన్ ఎక్కడ ఆడినా  బహుమతి పట్టుకొస్తున్నడంతో తల్లిదండ్రులు ఎంతో మురిసి పోయేవారు. నటరాజన్ ఏ జట్టు తరఫున ఆడితే ఆ జట్టు  గెలిచేది. నటరాజన్ వందలాది విలేజ్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. 150కి పైగా ట్రోఫీలను గెలిచాడు. దీంతో అతడికి  చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు వచ్చింది.  అలల ఆడుతూ నటరాజన్ ముందుగా రంజీల్లో అడుగుపెట్టి అక్కడ రాణించాడు. మన దేశంలో ఐపీఎల్ నిర్వహిస్తున్నట్టుగానే తమిళనాడులో టీఎన్పీఎల్( తమిళనాడు ప్రీమియర్ లీగ్) నిర్వహిస్తారు.  ఆ లీగ్లో నటరాజన్ సత్తా చాటాడు.

పంజాబ్ జట్టు 2017లో అతడిని రూ. 3 కోట్లకు కొనుగోలు ఎంపిక చేసుకుంది. మొదట్లో ఇంప్రాపర్ బౌలింగ్ యాక్షన్ తో అతడిని తిప్పి పంపారు. వికెట్లు కూడా పెద్దగా తీసింది లేదు. ఆ తర్వాత అతడు తన బౌలింగ్ ను మరింత సానబెట్టి మార్పులు చేసుకోవడంతో అతడికి క్లీన్ చీట్  వచ్చింది. రీ ఎంట్రీలో నటరాజన్ సన్ రైజర్స్ తరపున ఎంపికై  నటరాజన్ బాగా రాణిస్తున్నాడు. ముత్తయ్య మురళీధరన్ వంటి బౌలర్ ను కూడా   ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటిదాకా నటరాజన్ 9 వికెట్లు తీసి సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ ద్వారా వచ్చిన  డబ్బుతో నటరాజన్  సొంతూరులో తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించాడు. గ్రామంలోని క్రికెట్ అకాడమీ పెట్టి యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు.   పేదరికంలో పుట్టినా ప్రతిభ ఉంటే చాలు సక్సెస్ సాధించవచ్చని నిరూపించాడు. 'తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ను ఇంట్రెస్ట్ గా చూడడమే తప్ప.. దానిని కెరీర్గా ఎంచుకున్న వారు చాలా తక్కువ మంది. ప్రతిభ ఉంటే చాలు కుటుంబ ఆర్థిక నేపథ్యం తో సంబంధం లేదు. మన ఆట తీరే మనల్ని గెలిపిస్తుందని' నటరాజన్ పేర్కొన్నాడు.
Tags:    

Similar News