కరోనా, కరోనా మహమ్మారిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ తో ఎంతోమంది రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ తో సరైన ఉపాధి దొరక్క.. ఉద్యోగాలు లేక, ఉన్న ఉద్యోగాల్లో నుంచి తొలగించడంతో చాలామందికి కష్టాలు మొదలయ్యాయి. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా కరోనా మహమ్మారితో గడ్డుకాలం ఎదురవుతోంది. విద్యాసంస్థలు మూతపడటంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.తాజాగా ప్రకాశం జిల్లాల్లో అదే జరిగింది.. లాక్‌డౌన్ దెబ్బకు ఓ టీచర్ బతుకుచిత్రం పూర్తిగా మారిపోయింది.. కుటుంబ పోషణ కోసం రోడ్లపై కూరగాయలు అమ్మాల్సి వస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. పైన ఫొటోలో ఎర్ర టి షర్ట్ వేసుకొని కూరగాయలు అమ్ముతోన్న వ్యక్తి పేరు సలాం. అయన వృత్తి రీత్యా హిందీ టీచర్. ప్రకాశం జిల్లా కొమరోలు లో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో హిందీ టీచర్ గా పనిచేసేవారు. మార్చి వరకు ఎంతోమందికి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ ఉపాద్యాయుడు గత నాలుగు నెలలుగా ప్రవేట్ పాఠశాలలు కరోనా దెబ్బతో క్లోజ్ అయ్యాయి. దీనితో వీరికి ఉపాధి లేదు. దీనితో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో పాఠశాల ముసేసినప్పటి నుండి ఇప్పటివరకు కూడా రోజు వారి కూలి పనులకు వెళ్తూ ..వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నాడు. తనకు వచ్చిన పనుల్లో డ్రైవింగ్ తో పాటు చుట్టూ గ్రామాలలో రైతులు పండించే కూరగాయలను కొనుగోలు చేసి కొమరోలు మండల కేంద్రంలో అమ్ముతూ జీవితాన్ని సాగిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో బ్రతకండం భారమౌతున్న ఈ క్రమంలో , కృంగి పోకుండా వచ్చిన పనులను చేసుకోని ముందుకు సాగాలని, మానసిక ఆత్మస్థైర్యంని కొల్పోవద్దని సలాం చెప్తున్నాడు. అలాగే, ఇప్పటికైనా రాష్ట్రం ప్రభుత్వం ప్రవేట్ టీచర్స్ పై కరుణ చూపించి ఎదో ఒక రకంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. ఇక, కరోనా కారణంగా అని ప్రవేట్ రంగాలు కుదేలైన నేపథ్యంలో ఆర్థిక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, ఆ ధైర్య పడవద్దు అని సలాం లాంటి కొంతమంది వ్యక్తులు చూసిస్తున్నారు.