పేటీఎంకు షాకిస్తున్న ఎస్‌ బీఐ

Update: 2016-12-29 14:03 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం డిజిట‌ల్ లావాదేవీల వైపు దేశం ప‌రుగులు తీయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆకాంక్షిస్తుంటే..మ‌రోవైపు అందుకు విభిన్న‌మైన ప్ర‌చారాన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొద‌లుపెట్టింది. పెద్ద ఎత్తున ఉప‌యోగిస్తున్న పేటీఎంను నిరసిస్తూ అందుకు బ‌దులుగా త‌న సొంత వ్యాలెట్ అయిన ఎస్బీఐ బ‌డ్డీని ఉప‌యోగించాల‌ని ఖాతాదారుల‌కు సూచిస్తోంది. ఈ సూచ‌న కూడా ఓ క‌స్ట‌మ‌ర్ అడిగిన ట్విట్ట‌ర్ ప్ర‌శ్న‌కు సమాధానంగా కావ‌డం ఆస‌క్తిక‌రం.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే..ఎస్‌ బీఐకి చెందిన ఓ వినియోగ‌దారుడు త‌న ఖాతాలోని సొమ్మును పేటీఎంలోకి బ‌దిలీ చేయాల‌ని కోరాడు. దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నో చెప్ప‌డంతో ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా కార‌ణం ఏంట‌ని  ప్ర‌శ్నించాడు. అయితే దీనికి స‌మాధానంతోనే స‌రిపెట్ట‌కుండా ప్ర‌చారాన్ని సైతం  మొద‌లుపెట్టింది ఎస్‌ బీఐ. ఈ మేర‌కు కొన్ని చోట్ల  ఫ్లెక్సీలు వేస్తూ పేటీఎంలో చైనాకు చెందిన కంపెనీ అలీబాబా వాటాలున్నాయని కానీ ఎస్‌ బీఐ పూర్తిగా దేశ ఆస్తి అని పేర్కొంటోంది. అంతేకాదు ఎస్‌ బీఐ బ‌డ్డీ యాప్‌ ను అప్ గ్రేడ్ చేసుకోవాల‌ని వినియోగ‌దారుల‌ను కోరుతోంది. అదే స‌మ‌యంలో పేటీఎం యాప్‌ ను త‌మ ఫోన్ల‌లో బ్లాక్ చేసుకోవాల‌ని సూచిస్తోంది. అయితే ఈ ప‌రిణామంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు. దేశ‌మంతా డిజిట‌ల్ లావాదేవీల వైపు సాగాల‌ని కోరుతంటే...దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే బ్యాంకు మాత్రంఅందుకు భిన్నంగా త‌న వ్యాలెట్ మాత్రమే వాడాల‌ని కోర‌డం ఏమిట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News