ప్లాస్మా డోనర్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం !

Update: 2020-07-16 07:00 GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా పాజిటివ్ కేసులు పది లక్షలకి చేరువలో ఉన్నాయి . అలాగే ప్రతిరోజూ నమోదు అయ్యే పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్లాస్మా కి డిమాండ్ పెరుగుతుంది. అయితే , కరోనా నుండి కోలుకున్నవారిలో కొంతమంది తమకి తాముగా ముందుకి వచ్చి ,ఇతరుల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతున్నారు. అయితే , చాలామంది ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అయితే.. కరోనా సోకి పరిస్థితి చాలా క్రిటికల్ గా  ఉన్న సమయంలో వారిని కాపాడటానికి ప్రస్తుతానికి ప్లాస్మా థెరపీనే ముందున్న ఏకైక మార్గం. దీనితో  కర్ణాటక సర్కార్ ప్లాస్మా దాతలను ప్రోత్సహించాలని  కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా.. కరోనా వైరస్ సోకి , ఆ వ్యాధి న నుండి  కోలుకున్న వారు  ప్లాస్మా దానం చేస్తే రూ  5000 రూపాయలను ప్రోత్సాహకంగా ఇవ్వాలని కర్ణాటక  సర్కార్ నిర్ణయం తీసుకుంది అని  ఆ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ కె.సుధాకర్ ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో ... వారికీ ట్రీట్మెంట్ చేయడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండటం, కర్ణాటకలో కరోనా రోగులకు సరిపడా బెడ్లు కూడా లేవనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక లో పాజిటివ్ కేసులు 50 వేలకి చేరువలో ఉన్నాయి . రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగుళూరు లో వారం రోజులపాటు లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.

కరోనా లాంటి వైరస్ ‌లను మన రోగనిరోధక వ్యవస్థ అడ్డుకోలేదు. ఈ నేపథ్యంలో  కరోనా వచ్చి తగ్గిన రోగుల నుంచి రోగనిరోధక కణాలను సేకరించి ప్రస్తుతం ఇన్ఫెక్షన్ ‌తో బాధపడుతున్న వారి శరీరంలోకి ఎక్కిస్తే  వైరస్‌‌ ను సమర్థంగా ఎదుర్కోవచ్చు.  దీన్నే ప్లాస్మా థెరపీ అంటారు. ప్రస్తుతం భారత్‌లో చాలా రాష్ట్రాలు ప్లాస్మా థెరపీనే ఆశ్రయిస్తున్నాయి.
Tags:    

Similar News