యువ మంత్రి, కీలక నాయకుడు, మేకపాటి గౌతంరెడ్డి మరణం వైసీపీకి తీరని లోటు. ప్రస్తుతం నెల్లూరులో చాలా మంది నాయకులు వైసీపీకి ఉన్నారు.
అయితే.. వీరితో అనేక వివాదాలు.. విమర్శలు కూడా పార్టీ చవి చూసింది. కానీ, ఎలాంటి వివాదాలు.. విమర్శలు లేని.. ఏకైక మంత్రిగా జిల్లాలో ఆయన పేరు తెచ్చుకున్నా రు. అంతేకాదు..పార్టీలోనూ తనదైన ముద్ర వేశారు. ఎలాంటి సమస్య వచ్చినా.. ఎంత పెద్ద విమర్శ వచ్చి నా.. ఆయన ఆచి తూచి వ్యవహరించేవారు. నిజానికి వైసీపీలో ఉన్న యువ నాయకులను గమనిస్తే.. దూకుడు ఎక్కువగా ఉంది.
మాటకు మాట.. అన్నట్టుగా విపక్షాలపై విరుచుకుపడుతుంటారు. కానీ.. వీరికి భిన్నంగా గౌతంరెడ్డి వ్యవహ రించేవారు. విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ఆయన ఇంపార్టెన్నస్ ఇచ్చేవారు.
అంతేకాదు.. సౌమ్యుడిగా, సంస్కార వంతుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇది ఆయనను పార్టీలోను, ప్రజల్లోనూ అగ్రస్థానంలో నిలిపిందనడంలో సందేహం లేదు. వైసీపీని తీసుకుంటే.. గత ఎన్నికలకు ముందు.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా.. జగన్‌తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించారు. జగన్ పాదయాత్రకు పాదం కదిపారు.
ఇక, పార్టీలోనూ.. కీలక నిర్ణయాల విషయంలో గౌతంరెడ్డి.. ముఖ్య పాత్ర పోషించేవారు. వలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం వెనుక.. గౌతంరెడ్డి పాత్ర కూడా ఉంది. దీనివల్ల.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా పాలన జరుగుతుందని ఆయన చెప్పేవారు. అదేవిధంగా ప్రభుత్వం చేయాలని అనుకున్నపనులను ఖచ్చితంగా ప్రజలకు చేర్చేందుకు నిర్దిష్టవ్యవస్థ ఉండాలని.. తరచుగా ఆయన చెప్పేవారు.
ఈ క్రమంలోనే 1వ తారీకునే ఆయన పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఈ ఐడియా.. గౌతంరెడ్డిదే. అదేసమయంలో ఇతర దేశాల్లోను, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతులను సీఎం జగన్‌కు వివరించేవారు. ఇలా.. ఆయన వైసీపీలో ఒక కీలక నాయకుడిగా.. మేధావిగా చిన్న వయసులోనే ఎదిగారు. ఆయన లేనిలోటు నిజంగా పార్టీకి ఇబ్బందేనని చెప్పడంలో సందేహం లేదు.