రెహానా ఫాతిమాకు సుప్రీం షాక్

Update: 2020-08-07 16:30 GMT
కేరళ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా చిక్కుల్లో పడ్డారు. అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్ వేసుకొని దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి దేశవ్యాప్తంగా ఈమె వైరల్ అయ్యారు. ఇది వివాదాస్పదం అయ్యింది. తాజాగా రెహానాపై కొందరు కేసులు పెట్టడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ముందస్తు బెయిల్ కోరుతూ రెహానా పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మీరొక యాక్టివిస్ట్ అని.. అయినంత మాత్రాన ఎందుకు ఇలా నగ్నంగా ప్రవర్తించారు. సమాజంపై దుష్ప్రభావం చూపారు. అసభ్యతను వ్యాపింపచేశారు. పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసా అని సుప్రీం కోర్టు కాస్త గట్టిగానే రెహానాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

రెహానాపై చైల్డ్ పోర్నో గ్రఫీ కింద కేసు నమోదైంది. ఆమె తన అర్ధనగ్న శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. మైనర్లతో అసభ్యంగా ప్రవర్తించారనే కారణంతో పోక్సో చట్టం కింద ఆమెపై హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈమె సుప్రీంను ఆశ్రయించడంతో అక్కడా చుక్కెదురైంది.


Tags:    

Similar News