అనుకున్నదంతా అయింది. మరికాసేపట్లో తాలిబన్ల మూక చేతికి కాబూల్ నగరం చిక్కనుంది. దీంతో.. అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల జెండా ఎగిరినట్లే. కాబూల్ ను వశం చేసుకునేందుకు తాలిబన్లు అంతకంతకూ ముందుకు వస్తున్నారు. సదరు నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు.. కాబూల్ ను ముట్టడించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాబూల్ లో తాలిబన్ల జెండా ఎగిరినంతనే.. దేశం మరోసారి అంతర్యుద్ధంతో తల్లడిల్లిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అఫ్గానిస్థాన్ లో అత్యధిక భాగం తాలిబన్ల చేతికి వచ్చేసింది. కీలకమైన హెరాత్.. లష్కర్ షు.. కాందహార్ మొత్తం తాలిబన్ల వశమైంది. కాబూల్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఇక.. తాలిబన్లు.. సైన్యానికి మధ్య అధిక్యత కోసం జరుగుతున్న ప్రాంతాలు కొన్ని ఉన్నా.. అవి అన్నిచోట్ల ఉండటం గమనార్హం. దీంతో.. మరికాస్త పోరు అనంతరం స్పష్టమైన చిత్రం వచ్చే వీలుంది.
దేశంలోని దాదాపు మూడు వంతుల ప్రాంతాలు తాలిబన్ల చేతికి వెళ్లిపోయాయి. దేశంలో అతి పెద్ద నగరాలైన హెరాత్.. కాందహార్లు తాలిబన్ వశం కావటం తెలిసిందే. ఉత్తర.. పశ్చిమ.. దక్షిణ ప్రాంతాల్ని కొల్లగొట్టేసి తమ సంస్థకు చెందిన తెల్లజెండాను ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురవేస్తున్నారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని ‘మజార్ ఏ షరీఫ్’ను అక్రమించుకోవటం కోసం ముప్పేట దాడి చేసిన తాలిబన్లు.. భీకర పోరు అనంతరం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫర్యాబ్.. కునార్ ఫ్రావిన్స్ లు కూడా తాలిబన్ల వశమయ్యాయి. ఆఫ్టానిస్థాన్ లోని 34 రాష్ట్రాల్లో (వారు అక్కడ ఫ్రావిన్సులుగా వ్యవహరిస్తారు) 22 రాష్ట్రాలు తాలిబన్ల వశమయ్యాయి.
ఆఫ్గాన్ పై తాలిబన్లు పట్టు బిగుస్తూ ఉండటంతో అక్కడి ప్రజల్లో ఆందోళన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇక ముందు తమ జీవితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తలుచుకుంటేనే వారంతా తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని అక్కడి స్థానికులు వాపోతున్నారు. కాబూల్ ను తాలిబన్లు చుట్టుముడుతున్న నేపథ్యంలో దేశాధ్యక్షుడు అఫ్రాష్ ఘనీ దేశం విడిచి పారిపోతారన్న ప్రచారం సాగుతోంది. అంతర్జాతీయ మీడియా సైతం ఘనీ పని అయిపోయినట్లుగా కథనాలు రాసింది.
ఇలాంటివేళ.. ఆయన టీవీలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన 20 ఏళ్లుగా సాధించిన లక్ష్యాల్ని వదులుకోవటానికి తాను సిద్దంగా లేనన్న ఆయన.. దేశంలో చెలరేగే హింసాత్మక పరిస్థితుల్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే..ఆయన మాటలు ఆచరణలో ఏమేరకు సాధ్యమన్నది ప్రశ్నగా చెప్పక తప్పదు. తన రాజీనామా గురించి మాట్లాడని ఆయన.. ఆఫ్టాన్ల మీద యుద్దాన్ని ప్రకటించి.. ప్రజల ప్రాణాల్ని తీస్తుంటే తాను చూస్తూ ఊరుకోనని చెబుతున్న ఆయన.. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించేది లేదన్నారు. తాము అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతున్న ఆయన మాటలు బింకంగా ఉన్నాయే తప్పించి.. మరింకేమీ లేదన్న మాట వినిపిస్తోంది.