తన భర్త ఒక మహిళ.. ఎనిమిదేళ్లకు తెలుసుకొని భార్య షాక్

Update: 2022-09-17 00:30 GMT
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటారు పెద్దలు.. ఇది అందరి విషయంలో వర్తించదు అనిపిస్తుంది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆ గృహిణికి తాను చేసుకుంది పురుషుడిని కాదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 ఏళ్లకు గ్రహించింది. సాకులు చెప్తూ శోభనం వాయిదా వేస్తున్నా గ్రహించలేక పోయానని పోలీసుల ఎదుట రోధిస్తూ చెప్పింది. జెండర్ ఎక్స్ చేంజ్ తో మగాడిగా మారిన వాడితో తనకు వివాహం జరిపించిన అత్తింటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

తనను పెండ్లి చేసుకుంది మరో స్త్రీ అని తెలుసుకునేందుకు ఆమెకు దాదాపు ఎనిమిదేండ్లు పట్టింది. పెండ్లయిన కొత్తలో సాకులతో శృంగారం వాయిదా వేస్తుండడంతో తెలుసుకోలేకపోయిన ఆమె చివరికి అత్తింటి వారిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదు.  వడోదరలో జరిగిన ఈ విచిత్ర ఘటన కలవరానికి గురిచేసిందనడంలో సందేహం లేదు.

గుజారాత్ కు చెందిన ఓ మహిళకు మ్యారేజ్ అయి తన భర్త చనిపోయాడు. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. రెండో వివాహం చేసుకోవాలని ఆమె మ్యాట్రిమొనీని ఆశ్రయించింది. విరాజ్ వర్ధన్ ప్రొఫైల్ చూసి ప్రపోజల్ పెట్టింది. అందుకు అవతలి నుంచి కూడా సమ్మతమే అని సమాధానం వచ్చింది. ఇక ఇరువైపులా పెద్దలు మాట్లాడుకొని దగ్గరుండి 2014, ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. హనీమూన్ కోసం వారు కశ్మీర్ కు కూడా వెళ్లారు. తరుచూ సెక్స్ ను వాయిదా వేయడం, ఒక వేళ ఒత్తడి చేస్తే అసహజ శృంగారం చేసేవాడని వాపోయింది. ఒకసారి నిలదీస్తే కొన్నేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రమాదంలో సెక్స్ సామర్థ్యం కోల్పోయానని చెప్పుకొచ్చాడు. చిన్న ఆపరేషన్ చేయించుకుంటే అంతా సర్ధుకుంటుందని చెప్పి మెప్పించేవాడని పోలీసుల ముందు వాపోయింది.

తన బరువు తగ్గించుకునేందకు శస్త్రచికిత్స చేయించుకుంటానని 2020, జనవరిలో కోల్‌కతా వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడింది. విరాజ్ వర్ధన్ అసలు పేరు విజేత. ఆమె ఒక స్త్రీ అని.. లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని పురుష అవయవాలను ఏర్పాటు చేసుకొని పురుషుడుగా చలామణి అవుతున్నాడని బయటపడింది. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె అవాక్కైంది.

తనను తన అత్తింటి వారు మోసం చేశారని, జెండర్ విషయం దాచిపెట్టి వివాహం జరిపించారని సదరు మహిళ  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  కేసు దర్యాప్తు చేస్తున్నామని గోత్రి పోలీసులు చెప్పారు. విజేత (విరాజ్ వర్ధన్)  ఢిల్లీకి వెళ్లగా.. అక్కడి నుంచి వడోదరకు తీసుకొచ్చినట్లు విచారణ జరుపుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News