పొలం పనులకు వెళ్తే ఆ మహిళకు వజ్రం దొరికింది... తెల్లారే సరికి లక్షాధికారి !
ప్రతి ఏడాది తొలకరి జల్లులు పడితే చాలు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని గ్రామాల్లో తొలకరి జల్లులకు భూమిలోని వజ్రాలు బయటకు వస్తాయి. పొలాల్లోని వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి. అవి దొరికితే చాలు లక్షాధికారి, కోటీశ్వరుడు అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. దీంతో ప్రతీయేటా ఆ తొలకరిరాగానే వజ్రాల కోసం వేట ప్రారంభిస్తారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే , తాజాగా కర్నూల్ జిల్లాలో ఓ మహిళ అనుకోకుండా లక్షాధికారిగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. కుర్నాల్ జిల్లా ,తుగ్గలి మండలం , జొన్నగిరి పగిడిరాయి గ్రామాల సరిహద్దు ప్రాంతంలో వేరుశనగ పొలం లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళా కూలీకి 7 క్యారెట్ల వజ్రం చిక్కింది. ఆ వజ్రాన్ని గుత్తికి చెందిన వ్యాపారి రూ. 11 లక్షలకి కొనుగోలు చేసాడు. అలాగే మరో రెండు తులాల బంగారం కూడా ఇచ్చాడు. దీనితో కూలీ పనుల కోసం వెళ్లి లక్షాధికారిగా మారడం తో ఆ మహిళ పట్టరాని ఆనందంలో మునిగిపోయింది. అయితే , ఆ వ్యాపారికి అమ్మిన వజ్రం విలువ దాదాపుగా రూ. 1 కోటి వరకు ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కూలిపనులు చేసుకునే మహిళకు వజ్రం దొరికిందనే విషయం బయటకు తెలియడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ అయ్యింది.