ఉత్తిపుణ్యానికే మాట్లాడే రకం కాదు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. ఆయనకు వీర విధేయుడు.. నమ్మకస్తుడు.. బోలెడంతమంది సలహాదారులు ఉన్నా.. వారందరిలోనూ ప్రధముడు సజ్జల రామక్రిష్ణారెడ్డి. తాను నేరుగా అనలేని చాలా మాటల్ని సజ్జల చేత అనిపిస్తుంటారు జగన్. దీన్ని మరోలా చెప్పాలంటే.. ఎప్పుడు.. ఏ విషయం మీద.. ఎలా మాట్లాడితే సీఎం జగన్ కు నచ్చుతుందన్న విషయం సజ్జలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి సజ్జల వారి నోటి నుంచి గడిచిన ఎనిమిదేళ్లలో ఎప్పుడూ రాని సరికొత్త మాట వచ్చింది.
అదే.. సుప్రీంకోర్టు సూచన చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసిపోవాలన్నది తమ పార్టీ విధానమని పేర్కొన్నారు. కలిసిన తర్వాత విడిపోవటానికి అవకాశం ఉంది కానీ.. కలిసి విడిపోయిన తర్వాత మళ్లీ కలవటం సాధ్యమే కాదు. అందునా రాష్ట్రానికి సంబంధించిన విషయంలో అది అసాధ్యమన్న విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అలాంటిది ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న.. సజ్జల నోటి నుంచి రావటం ఏమిటి? దాని వెనుకున్న లెక్కలేమిటి? అన్నది చూస్తే.. తెర వెనుక బోలెడు లెక్కల నేపథ్యంలోనే ఆయన నోటి నుంచి ఆ కీలక వ్యాఖ్య వచ్చిందన్న విషయం అర్థమవుతుంది.
ఒక పిట్టకు రెండు పిట్టలు అన్న మాట వింటాం.కానీ.. జగన్ ట్రైనింగ్ లో సజ్జల రెండింటితో సరిపెడితే ఆయన సామర్థ్యం మీదనే సందేహం కలుగుతుంది. అందుకే ఆయన ఏకంగా మూడు పిట్టల మీద ఫోకస్ చేశారు తాజా వ్యాఖ్యతో. అదెలా అంటే.. ఆయన నోటి నుంచి వచ్చిన సంచలన వ్యాఖ్య టైమింగ్ చూస్తే విషయం మరింత అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర అధికారపక్ష అధినేత తమ పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం.. సరిగ్గా దానికి గంటల వ్యవధిలోనే సమైక్య రాగాన్ని సజ్జల నోట రావటం గమనార్హం.
ఎందుకిలా? అంటే దీనికి మూడు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో మొదటిది ముఖ్యమైనది సెంటిమెంట్ ను రాజేయటం ద్వారా.. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు ఇతోధికంగా సాయం చేయటం. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత నిండుగా ఉన్న కేసీఆర్ సర్కారుకు మరో ఏడాది కంటే తక్కువ వ్యవధిలో జరిగే ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను తెచ్చి పెట్టేలా సమైక్య మాట సజ్జల లాంటి వారి నోటి నుంచి వచ్చినంతనే తెలంగాణ వాదులు ఒక్కటి అవుతారు. ఆంధ్రోళ్ల కన్ను తెలంగాణ మీద పడిందన్న భావన వచ్చినంతనే.. కేసీఆర్ కు అధికారాన్ని కట్టపెట్టే ప్రక్రియ ఇట్టే సరిపోతుంది.
దీంతో.. 2019 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రావటానికి సాయం చేసిన కేసీఆర్ రుణాన్ని తీర్చుకున్నట్లు అవుతుంది. ఇక.. రెండోది.. విన్ టు విన్ సూత్రంగా చెప్పాలి. తమ నోటి నుంచి సమైక్య రాగం వచ్చినంతనే తెలంగాణలో సెంటిమెంట్ రగులుతుంది. అదే సమయంలో ఏపీలోనూ తమ వాదనను సమర్థంగా వినిపిస్తున్న అధికారపక్షంగా పలువురు మనసుల్ని దోచుకునే వీలు ఉంటుంది. దీంతో.. బీఆర్ఎస్ పేరుతో ఏపీ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ తమకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెప్పాలి.
ఇక.. మూడోది.. ముఖ్యమైనది.. తమ కంట్లో నలకలా.. కాల్లో ముల్లులా మారిన షర్మిలకు దిమ్మ తిరిగే షాకివ్వటం. తమ నోటి నుంచి వచ్చే సమైక్య రాగం ఎఫెక్టు షర్మిలపై ఏ రీతిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆమెను అనుమానంగా చూసే తెలంగాణవాదులకు మరింత సందేహాన్ని రేకెత్తించేలా చేసేందుకు తన నోటి నుంచి వచ్చే ఈ ఒక్క మాట సరిపోతుందన్న విషయం సజ్జలకు తెలియంది కాదు. ఇన్ని కారణాలు ఉన్న తర్వాత.. తమకు మేలు చేసే అవకాశం ఉన్న సమైక్య రాగాన్ని సజ్జల ఎందుకు వినిపించకుండా ఉంటారు చెప్పండి?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.