అధికారపార్టీ ఎమ్మెల్యే.. డమ్మీ అయిపోయాడా..?

Update: 2020-08-15 16:30 GMT
శ్రీకాకుళం జిల్లాలో వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్ గా రాజాం నియోజకవర్గం ఉంటుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్ధకాలంగా తమ్ముళ్ల తన్నులాటలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ వైసీపీదే హవా నడుస్తోంది.

2014,2019 రెండు ఎన్నికల్లో రాజాంలో వైసీపీ జెండా ఎగిరింది. వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు వరుసగా రెండు సార్లు గెలిచాడు. అయితే రెండు సార్లు గెలిచినా అభివృద్ధి పనులు చేపట్టడంలో ఎమ్మెల్యే జోగులు నిస్సహాయత కనిపిస్తోంది. ప్రతిపక్షంలోనూ.. అధికార పక్షంలోనూ ఆయన తనకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. అభివృద్ధి చేయలేనంటూ ప్రజలు, కార్యకర్తల వద్ద వాపోతున్నారట.. దీంతో జనాల దృష్టిలో జోగులు డమ్మీ ఎమ్మెల్యేగా మిగిలిపోతున్నారట..

జోగులు హయాంలో రాజాంలో అభివృద్ధి పడకేస్తోందన్న ఆవేదన ప్రజలు, నేతల్లో ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా అడుగు కూడా ముందుకు పడడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యేనే ఇలా అంటుంటే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం నేతలు సతమతమవుతున్నారట..

ఇప్పుడు ఎమ్మెల్యే చేతులెత్తేసి సీనియర్ నేత రాజశేఖరం.. ఆయన కొడుకు విక్రాంత్ నే అడంగడని సెలవిస్తున్నారట..దీంతో ఎమ్మెల్యే జోగులు ఉన్నా లేనట్టే అని ప్రజలు వాపోతున్నారట..
Tags:    

Similar News