ఏపీలో మ‌రికొన్ని లాక్ ‌డౌన్ స‌డ‌లింపులు!

Update: 2020-04-29 12:41 GMT
కరోనా కట్టడిలో భాగంగా లాక్‌ డౌన్ విధించింది ప్రభుత్వం.. కేంద్రం ఆదేశాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నాయి అయినా కరోనా కేసులు పెరుగుతుండంతో.. లాక్‌ డౌన్‌ ను పొడిగించాల్సిన పరిస్థితి - మరోవైపు కరోనా హాట్‌ స్పాట్లు మినహా ఏప్రిల్ 20 నుండి కొన్ని సడలింపులు ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపుకు అదనపు గైడ్ లైన్స్ విడుదల చేశారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనలతో కొత్త గైడ్ లైన్స్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

* వ్యవసాయ రంగం - హార్టికల్చర్ పనులకు మినహాయింపు ఇచ్చారు.

* ప్లాంటేషన్ పనులు - కోత - ప్రాసెసింగ్ - ప్యాకింగ్ - మార్కెటింగ్‌ కు వెసులుబాటు.

* ఆర్థిక రంగానికి మినహాయింపు ఇచ్చారు.

* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్ - టెలికం కేబుల్స్ పనులకు అనుమతి.

* కొన్ని అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు - వారు వాడే వాహనాలకు అనుమతి.

* వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి

* వలస కార్మికులు లాక్‌ డౌన్ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రంలో మాత్రమే పనులకు అనుమతి.

* బుక్స్ షాపులకు - ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు ఇచ్చారు.

* ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు .

* మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉంటే షాపులు - మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి.
Tags:    

Similar News