వెక్కిరిస్తున్న కార్పొరేషన్లు.. ఈ పదవులు వద్దంటున్న నేతలు.. జగన్‌కు సంకటమేనా?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మొత్తం 63 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న కార్పొరేషన్లను భారీ ఎత్తున పెంచామని.. సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. సీఎం జగన్ చెప్పుకొంటున్నారు. ఈ కార్పొరేషన్ల ద్వారా.. ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని కూడా ఆయన చెబుతున్నారు. అయితే.. వాస్తవంలోకి వచ్చే సరికి మాత్రం దీనికి భిన్నంగా పరిస్థితి ఉండడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఎందుకంటే.. కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ, వాటికి నిధులు లేవు. నిన్న మొన్నటి వరకు కనీసం తాము కూర్చునేందకు.. చర్చించుకునేందుకు మౌలిక వసతులు కూడా లేవని కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకులు లబోదిబో మన్నారు. అయితే.. పంచాయితీ నిధులను అడ్జెస్ట్ చేసిన ప్రభుత్వం కుర్చీలను ఏర్పాటు చేసింది. ఇది గత నవంబరులోనే జరిగింది. దీంతో ఇప్పుడు చైర్మన్లు ఆఫీసులకు వస్తున్నారు.
కానీ, వారికి నిధులు కేటాయించలేదు. నిజానికి బడ్జెట్‌లో కార్పొరేషన్ల వారీగా.. కోట్ల రూపాయలు కేటాయిం చారు. చిట్ట చివరన ఉన్న బోయ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు రూ.10 కోట్ల చొప్పున కాపులకు అత్యధి కంగా 100 కోట్ల చొప్పున బడ్జెట్‌లో చూపించారు. అయితే.. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నప్పటికీ.. ఆ నిదులు ఏమయ్యాయో.. దేనికి ఖర్చు పెట్టారో.. అసలు ఇచ్చారా? అంటే.. కూడా సమాధానం కనిపించ డం లేదు.
మరోవైపు.. ఎన్నికలు తన్నుకొస్తున్నాయి. ఈ ఎన్నికల వేళ. కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఆయా సామాజిక వర్గాలను ఏకీకృతం చేసి.. పార్టీకి అనుకూలంగా చక్రం తిప్పేలా చేయాలని జగన్ చెబుతున్నారు. అయితే.. నిషధులు లేకుండా.. ఆయా వర్గాలను సంతృప్తి పరచకుండా.. ఇది సాధ్యమేనా? అన్నది చైర్మన్ల మాట. అయితే.. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న మాట.. ఏంటంటే.. వచ్చే బడ్జెట్‌లో కేటాయించి ఇస్తామని.. మరి దీనిని ఎవరు నమ్మాలి? ఎలా నమ్మాలి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా.. సెగ తప్పదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.