వైసీపీ ప్ర‌యోగించే అస్త్రాలు ఇవే.. ప్ర‌జ‌లు సిద్ధంకావాల్సిందే!!

Update: 2023-01-11 05:24 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న వైసీపీ 175కి 175 సీట్ల‌లోనూ విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు వారికిఅందిస్తున్న సంక్షేమాన్ని ప‌దేప‌దే ప్ర‌జ‌ల‌కు గుర్తు చేసేందుకు గ‌డ‌ప గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఇది కొన్ని చోట్ల బెడిసికొడుతోంది. త‌మ‌కు ఎన్ని ఇస్తున్నార‌నేది ప‌క్క‌న పెడితే.. ర‌హ‌దారులు, ఉద్యోగాలు.. ప‌నులు ఇవ్వ‌డం లేద‌ని.. ఇసుక ధ‌ర‌లు పెరిగిపోయిఇబ్బంది ప‌డుతున్నామ‌ని.. కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మొహం మీదే చెప్పేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఎమ్మెల్యేలు విసిగిపోతున్నారు. మ‌రోవైపు.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతున్న ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న వైసీపీ అధిష్టానం కూడా అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిందని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో కేవ‌లం ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన‌వి.. ఇస్తున్న‌వి మాత్ర‌మే ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌యోజ నం ల‌భించ‌డం క‌ష్ట‌మ‌ని అనుకుంటున్న పార్టీ.. ఇక‌పై తాము అధికారంలోకి వ‌స్తే.. ఏం చేయాలనే విష యంపై దృష్టి పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేసే విష‌యాల‌పై పార్టీ దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా ఇప్ప‌టికే ల‌బ్ది దారుల‌కు కేటాయించిన ఇళ్ల‌లో పూర్తిగా ఇళ్ల నిర్మాణం కాలేదు.

ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టి.. తాము మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. పూర్తిగా వాటిని నిర్మించి ఇస్తామ‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, మూడు రాజ‌ధానుల విష‌యంపైనా.. ఇదే ఫార్ములాను ప్ర‌యోగించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇది ఎలానూ న్యాయ‌స్థానాల్లో ఉంది క‌నుక తేలే ప‌రిస్తితి లేదు. సో.. దీనిని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని అంటున్నా రు.

అదేస‌మ‌యంలో అమ్మ ఒడిని మ‌రింత మందికి ఇవ్వ‌డంతోపాటు.. అదేవిధంగా దీనిని రూ.20000 వ‌ర‌కు పెంచ‌నున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఇస్తున్న చేయూత నిధుల‌ను రూ.25000 వ‌ర‌కు పెంచే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఇలా.. ప్ర‌తి ప‌ధ‌కాన్ని పెంచ‌డ‌మో.. పొడిగించ‌డ‌మో చేయ‌డం ద్వారా.. తాము లేక‌పోతే.. ల‌బ్ధి దారులు న‌ష్ట‌పోతార‌నే వాద‌న‌ను బ‌లంగా వినిపించాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News