జనసేన కావలి అభ్యర్థి వెనుక ఇంత కథ.?

Update: 2019-03-06 07:57 GMT
జనసేన తరుఫున బలమైన అభ్యర్థి ప్రకటన.. దాదాపు టీడీపీ తరుఫున నిలబడతాడు అని భావించిన అభ్యర్థి.. టీడీపీలో సమీకరణాల దృష్ట్యా సాధ్యపడకపోవడంతో ఇప్పుడు జనసేన తరుఫున  పోటీపడుతున్నట్టు ప్రకటించారు. ఇది యాధృచ్చికంగా జరిగిందా? లేక టీడీపీ, జనసేన ల మధ్య ఏదైనా తెరవెనుక మంత్రాంగం ఉందో తెలియదు కానీ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

జనసేనాని పవన్ తాజాగా కావలి ఎమ్మెల్యే సీటును పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తికి ప్రకటించారు. ఆయన నియోజకవర్గంలో మంచి మనిషిగా పేరుంది. కష్టపడి పైకొచ్చి.. కోట్లకు అధిపతి అయ్యాడు. తను సంపాదించిన దాంట్లో చాలా భాగం నియోజకవర్గంలో సేవలకే ఖర్చు చేస్తుంటాడు. ఎమ్మెల్యే కావాలని ఆశతో ఎంతో కాలంగా శ్రమిస్తున్నారు. ఈయన మొదటి టిడీపీ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించారట.. టీడీపీ ఒకదశలో ఇతని మీద కన్నేసి అభ్యర్థిగా బరిలోకి దించుతుందని ప్రచారం జరిగింది. కానీ సమీకరణాలు దృష్ట్యా సాధ్యపడలేదట.

ఇప్పుడు ఇలాంటి మంచి మనషి జనసేన తరుఫున కావలి నుంచి పోటీచేస్తున్నారు. పసుపులేటి సుధాకర్ జనసేన వైపునుంచి దిగినా తెరవెనుక టీడీపీ మంత్రాంగం ఉందని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కావలి ఎమ్మెల్యేగా ప్రస్తుతం బలమైన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన్ను ఢీకొట్టి టీడీపీ గెలిచే పరిస్థితిలో లేదట.. అందుకే జనసేన నుంచి బలమైన అభ్యర్థిని దింపితే అంతిమంగా ఓట్లు చీలి టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని ఈ స్కెచ్ గీసినట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఓడడం కోసమే సుధాకర్ ను జనసేనలోకి పంపారన్న ప్రచారం నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది. టీడీపీ గెలవకున్న ఫర్వాలేదు కానీ వైసీపీ గెలవద్దని ఈ ప్లాన్  వేసినట్టు సమాచారం.   ఈ నియోజకవర్గానికి ఈ స్ట్రాటజీ పరిమితం కాలేదని.. వైసీపీ బలంగా ఉన్న చోట్ల జనసేన తరుఫున బలమైన నేతలను బరిలో దించుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారాన్ని జనసేనాని పవన్ ఖండిస్తారా? యాధృశ్చికంగా రాజకీయ జంపింగ్ లు జరుగుతుంటాయని వివరణ ఇస్తారో  చూడాలి మరి..  
    

Tags:    

Similar News