వాళ్లంద‌రికీ డ్ర‌గ్ టెస్ట్ నిర్వ‌హించాల్సిందే.. ఆ దేశంలో కీల‌క చ‌ర్చ‌!

Update: 2021-07-04 09:30 GMT
మ‌త్తు.. చాలా రూపాల్లో ఉంటుంది. ఆయా రూపాల‌ను బ‌ట్టి.. తీవ్ర‌త‌లోనూ తేడా ఉంటుంది. ఇందులో పీక్ స్టేజ్ లో ఉండేది మాత్రం హెరాయిన్‌, కొకైన్ వంటి డ్ర‌గ్స్‌. ఈ డ్ర‌గ్స్ తీసుకోవ‌డం కొంద‌రికి అకేష‌న్ అయితే.. మ‌రికొంద‌రికి డైలీ కావాల్సిందే. ఆ మ‌త్తులో జోగుతూ.. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్టు ఫీల‌వుతుంటారు. విశ్రాంతి దొర‌కినట్టు భావిస్తుంటారు. అయితే.. ఆనందం క‌లిగినా.. అంతిమంగా మాత్రం విషాద‌మే మిగులుతుంద‌న్న‌ది తెలిసిందే. ఆర్థికంగా, ఆరోగ్య ప‌రంగా అన్నీ కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ మ‌త్తుకు బానిస‌య్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఈ ప‌రిస్థితి ఆ దేశం.. ఈ దేశం అని కాదు. మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉంది. ఇటీవ‌ల‌.. వియ‌న్నాలోని యూఎన్ ఆఫీస్ ఆఫ్ డ్ర‌గ్స్ అండ్ క్రైమ్ గురువారం విడుద‌ల చేసిన ప్ర‌పంచ ఔష‌ధ నివేదిక ప్ర‌కారం.. గ‌త ఏడాది ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 25 కోట్ల 70 ల‌క్ష‌ల మంది డ్ర‌గ్స్ వినియోగించార‌ట‌. వీరిలో 3 కోట్ల 60 ల‌క్ష‌ల మంది వివిధ ర‌కాల జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్నార‌ట‌.

వీరిలో గ‌రిష్టంగా 64 సంవ‌త్స‌రాలు మొద‌లు.. క‌నిష్టంగా 15 సంవ‌త్స‌రాల వ‌య‌సువారు కూడా ఉన్నార‌ట‌. 78 దేశాల్లోని వైద్యుల‌ను స‌ర్వే చేయ‌గా.. దాదాపు 43 శాతం మంది గంజాయి వాడుతున్న‌ట్టు తెలిపార‌ట‌. మిగిలిన వారంతా త‌మ‌కు అందుబాటులో ఉన్న ఇత‌ర‌త్రా డ్ర‌గ్స్ వినియోగిస్తున్న‌ట్టు చెప్పార‌ట‌. గ‌డిచిన పాతిక సంవ‌త్స‌రాల్లో కొన్ని దేశాల్లో గంజాయి వినియోగం ఏకంగా నాలుగైదు రెట్లు పెరిగింద‌ట‌. మ‌న దేశంలోనూ ఇలాంటి వారి శాతం ఎక్కువ‌గానే ఉంది.

అయితే.. ఈ డ్ర‌గ్స్ వినియోగం కువైట్ శృతిమించిపోతోంద‌నే ఆందోళ‌న స్థానికంగా వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో.. కువైట్ పార్ల‌మెంట్ స‌భ్యుడు ముహ‌న్న‌ద్ అల్ స‌యేర్.. ఓ కీల‌క ప్ర‌తిపాద‌న చేశారు. ఆ దేశ ఆరోగ్య‌శాఖ‌తోపాటు, అంత‌ర్గ‌త మంత్రిత్వ శాఖ‌, న్యాయ శాఖ ముందుకు ఈ ప్ర‌తిపాద‌న‌లు అంద‌జేశారు.

ఇక‌నుంచి ప్ర‌వాసుల రెసిడెన్సీ ప‌ర్మిష‌న్ రెన్యూవ‌ల్ చేసే స‌మ‌యంలో త‌ప్ప‌కుండా.. డ్ర‌గ్ టెస్టు నిర్వ‌హించాల‌ని కోరారు. అంతేకాదు.. దేశంలోని పౌరులు పెళ్లి చేసుకునే స‌మ‌యంలో కూడా డ్ర‌గ్ టెస్టు నిర్వ‌హించాల‌ని సూచించారు. అదేవిధంగా.. ఉద్యోగాలు పొందే స‌మ‌యంలోనూ వారికి డ్ర‌గ్స్ టెస్టు చేయాల‌ని అంటున్నారు. ఇలాంటి ఆదేశాలు తెస్తే త‌ప్ప‌.. డ్ర‌గ్ వినియోగాన్ని అదుపులోకి తేవ‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు. మ‌రి, దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది తెలియ‌దు.
Tags:    

Similar News