వారు ఇస్తున్నారు.. వీరు తెస్తున్నారు.. అప్పులు తీర్చేదెవ‌రు..?

Update: 2022-07-13 12:30 GMT
ఏపీ అప్పుల కుప్ప‌గా మారుతోంది. వారం వారం.. అప్పుల వారంగా మంగ‌ళ‌వారాన్ని మార్చేసిన వైసీపీ ప్ర‌భు త్వం.. అందిన కాడికి అప్పులు చేస్తోంది. అయితే.. ఈ అప్పుల విష‌యంలోనూ.. రాజ‌కీయాలు న‌డుస్తున్నా యి. అధికార ప‌క్షవైసీపీనీ చూసుకుంటే.. అప్పులు చేసిన‌ప్ప‌టికీ.. సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని.. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే ప‌ట్టం క‌ట్టాల‌ని.. వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టికే చూచాయ‌గా.. చెబుతున్నారు. ప్ర‌తి స‌మావేశంలోనూ.. అప్పులు చేసేది సంక్షేమం కోస‌మేన‌ని అంటున్నారు.

ఇక‌, మ‌రోవైపు.. ఇదే విష‌యంపై బీజేపీ మ‌రో మాట చెబుతోంది. కేంద్రం నుంచి డ‌బ్బులు విరివిగా నిధు లు వ‌స్తున్నాయ‌ని.. కాబట్టి తాము ఇస్తున్న నిధులవ‌ల్లే ఏపీలో ప్ర‌భుత్వం అన్నీ చేస్తోంద‌ని అంటున్నారు. అంటే.. కేంద్రం ఇస్తున్న నిధులు..

ప్ర‌త్య‌క్షంగా వైసీపీకి అందుతున్నా.. ప‌రోక్షంగా తాము చేస్తున్న‌దేన‌ని.. ప్ర‌జ‌ల‌కు అందుతున్న సంక్షేమంలో త‌మ‌కు కూడా భాగస్వామ్యం ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అటు వైసీపీ, ఇటు బీజేపీల వాద‌న ఓటు బ్యాంకు రాజ‌కీయ‌మే!

అంటే.. సంక్షేమం చేస్తున్నాం..కాబ‌ట్టి త‌మ‌నే గెలిపించాల‌ని వైసీపీ.. ఆ సంక్షేమానికి నిధులు ఇస్తున్నాం కాబ‌ట్టి.. త‌మ‌కే ప్ర‌జ‌లు ఓటేయాల‌నే విధంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. ఇక్క‌డ కీల‌క‌మైన విష‌యం.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల‌కు వ‌డ్డీల నుంచి అస‌లు వ‌ర‌కు కూడా ప్ర‌జ‌లే తీర్చాలి. ఈ విష‌యంలో ఏ ప్ర‌భుత్వమూ కూడా.. సొంత నిధుల నుంచి అంటే.. ప్ర‌జాప్ర‌తి నిధుల సొంత నిధుల నుంచి ఒక్క‌రూపాయి కూడా చెల్లించే ప‌రిస్థితి ఉండ‌దు.

మ‌రోవైపు.. ఏపీ లెక్క‌కు మించి అప్పులు చేస్తోంద‌ని.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా అప్పులు చే యడంలో ముందుంద‌ని.. కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ స‌హా.. ఆర్థిక శాఖ వ‌ర్గాలు కూడా పేర్కొంటు న్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఏపీ ప్ర‌భుత్వం అడ‌గ‌డం.. కేంద్రం ఇవ్వ‌డం ష‌రా మామూలుగా మారిపోయింది. దీంతో అప్పులు తెచ్చేస్తున్నారు.. అదేస‌మ‌యంలో పంచేస్తున్నారు. కానీ, రేపు తీర్చాల్సింది మాత్రం.. ప్ర‌జ‌లే. ప్ర‌భుత్వాలు మారినా.. ప్ర‌జ‌ల‌పైనే ఈ భారం ప‌డుతుంది.

అది ప‌న్నుల రూపంలోనో.. సెస్సుల రూపంలోనో.. ఏదేమైనా.. ప్ర‌జ‌ల‌పైనే అప్పుల భారం పడుతుంద నేది వాస్త‌వం. ఈ విష‌యం అత్యంత‌కీల‌క‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  అప్ప‌టికే అన్ని రూపాల్లో నూ... ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు బాదేస్తున్నారు. అదేస‌మ‌యంలో మ‌ద్యం ధ‌ర‌ల‌ను పెంచేశారు. ఇక‌, విద్యుత్‌, బ‌స్సు చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో అప్పులు పెరిగితే.. ఆ భారం ప్ర‌జ‌ల‌పైనే ప‌డుతుంది త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని అంటున్నారు ప రిశీల‌కులు.
Tags:    

Similar News