ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే క్రికెటర్లు వీరే..!

Update: 2021-07-13 03:16 GMT
క్రికెట్ ఎంత కాస్ట్లీ గేమ్ అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఇందులో క్రీడాకారుడిగా స‌క్సెస్ అయితే చాలు.. ఆటోమేటిగ్గా ఆర్థికంగా కూడా బ‌ల‌వంతులు అవుతారు. అయితే.. అన్ని దేశాల్లోనూ ఈ ప‌రిస్థితి ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు జింబాబ్వే ఆట‌గాళ్ల‌కు క‌నీస సాల‌రీలు కూడా ఉండ‌వు. ఆయా బోర్డుల కెపాసిటీని బట్టి, ఆయా దేశాల్లో క్రీడ‌కు ఉన్న డిమాండ్ ను బ‌ట్టి ఆట‌గాళ్ల ఆదాయాలు ఆధార‌ప‌డి ఉంటాయి.

ఇలా చూసుకున్న‌ప్పుడు ప్ర‌పంచం క్రికెట్లో అత్యంత ధ‌న‌వంత‌మైన బోర్డులు మూడే. ఒక‌టి భార‌త్‌, రెండు ఇంగ్లండ్‌, మూడు ఆస్ట్రేలియా. వీటి త‌ర్వాత‌నే మిగిలిన బోర్డులు ఉన్నాయి. దీంతో.. స‌హ‌జంగా క్రికెట‌ర్లు కూడా ఈ బోర్డుల ప‌రిధిలోని వారు ఎక్కువ‌గా ఆదాయం ఆర్జించే అవ‌కాశం ఉంటుంది. లేటెస్ట్ గా  స్పోర్ట్స్ నైల సంస్థ.. 2021 వార్షిక ఆదాయం ఆధారంగా అత్య‌ధికంగా ఆర్జిస్తున్న టాప్‌-10 క్రికెట‌ర్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇందులో ఏకంగా ఆరుగురు క్రికెట‌ర్లు ఇండియాకు చెందిన‌వారే ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ లిస్టులో అగ్ర‌స్థానంలో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా అత్య‌ధికంగా సంపాదించే టాప్ క్రికెట‌ర్ గా కూడా గుర్తింపు పొందిన కోహ్లీ.. అత్య‌ధిక వార్షిక ఆదాయం ఆర్జించే క్రికెట‌ర్ గా గుర్తింపు పొందాడు. క్రికెట్ ఆడ‌టం ద్వారా, బీసీసీఐతో కుదుర్చుకున్న కాంట్రాక్టు ద్వారా, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌డం ద్వారా క‌లిపి మొత్తంగా కోహ్లీ ఏడాదికి 208.56 కోట్ల రూపాయ‌ల‌ను ఆర్జిస్తున్నాడు.

ఆ త‌ర్వాత స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. అయితే.. కోహ్లీకి ధోనీకి మ‌ధ్య ఏకంగా వంద కోట్ల తేడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ధోనీ ఏడాదికి 108.28 కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నాడు. ధోనీ త‌ర్వాత మూడో స్థానంలో కూడా ఇండియ‌న్ క్రికెట‌రే నిలిచాడు. రోహిత్ శ‌ర్మ సంవ‌త్స‌రానికి రూ.74.49 కోట్లు సంపాదిస్తున్నాడు.

నాలుగో స్థానంలో ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఉన్నాడు. స్టార్ ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్ ఏడాదికి 60 కోట్ల రూపాయ‌లు ఆర్జిస్తున్నాడు. ఐదో స్థానంలో టీమిండియా హార్డ్ హిట్ట‌ర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇత‌ను ఏడాదికి 59.9 కోట్ల రూపాయ‌లను ఆర్జిస్తున్నాడు. ఆరో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఇత‌నికి ఏడాదికి 55.86 కోట్ల రూపాయ‌లు వ‌స్తున్నాయి.

ఎనిమిద‌వ వ‌స్థానంలో టీమిండియా స్పీడ్ స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఈ పేస‌ర్ ఏడాదికి 31.65 కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నాడు. ఆ త‌ర్వాత సౌతాఫ్రికా స్టార్, మిస్ట‌ర్-360 ఏబీ డివిలియ‌ర్స్ ఉన్నాడు. సంవ‌త్స‌రానికి ఏబీ 22.50 కోట్ల రూపాయ‌లను సంపాదిస్తున్నాడు. తొమ్మిదో స్థానంలో ఉన్న ప్యాట్ క‌మిన్స్ 22.40 కోట్ల రూపాయ‌లు ఆర్జిస్తుండ‌గా.. ప‌దో స్థానంలో ఉన్న సురేష్ రైనా 22.24 కోట్ల రూపాయ‌ల‌ను ఆర్జిస్తున్నాడు. వీరి సంపాద‌న‌లో ఐపీఎల్ కాంట్రాక్టులు మొద‌లు యాడ్స్ ఎండార్స్ మెంట్లు, సోషల్ మీడియా కాంట్రాక్టులు ఇవన్నీ ఉన్నాయి.
Tags:    

Similar News